Dabangg 3 In Telugu: నాలుగు భాషలు మాట్లాడనున్న చులబుల్ పాండే, దబాంగ్ 3 మోషన్ పోస్టర్లు విడుదల

సల్మాన్ ఖాన్ దబాంగ్ - 3, ఈ సారి నాలుగు భాషలలో (హిందీ, తమిళం, తెలుగు, కన్నడ)  విడుదలకు సిద్ధం అవుతోంది. దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రం కొత్త మోషన్ పోస్టర్ ఈ రోజు విడుదల చేయడo జరిగింది.

తమిళంలో నటుడిగా, దేశం అంతటా గొప్ప డాన్సర్ గా ఇమేజ్‌ను క్రీఎట్ చేసుకున్న ప్రభుదేవా, చులబుల్ పాండే అక్రమార్జనను దక్షిణాదికి తీసుకురావడానికి సిద్ధ పడుతున్నాడు.

ఈ చిత్రాన్నీ సొంత ప్రొడక్షన్స్ అయిన సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ మరియు అర్బాజ్ ఖాన్ ప్రొడక్షన్స్ కింద అన్నదమ్ములు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2010, 2012 వచ్చిన దబాంగ్ 1 మరియు దబాంగ్ 2 కి సీక్వెల్ అని ముచ్చటగా మూడవ విడత అన్ని భాషల్లో దబాంగ్ ఫిల్మ్ సిరీస్ కి సీక్వెల్గా దబాంగ్ 3 నిర్మిస్తున్నారని చిత్ర బృందం తెలియజేసారు. ఈ చిత్రాన్ని ప్రభుదేవా, దిలీప్ శుక్లా కలిసి లికించారు.

ఈ కథ కోసం మధ్యప్రదేశ్ లో ప్రత్యేకంగా సెట్ వెయ్యడం జరిగింది. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ తొ పాటు సోనాక్షి సిన్హా, అర్బాజ్ ఖాన్ నటించారని, మహీ గిల్ మునుపటి చిత్రంలోని తమ పాత్రను తిరిగి పోషించగా, సుదీప్ విల్లన్ గా నటిస్తారని తెలియజేసారు.

Telugu:

Tamil:

Kannada:

Hindi: 

అన్ని హంగులతో ముస్తాబై . ఈ చిత్రం 20 డిసెంబర్ 2019 లో విడుదల కానుందని ఈ సందర్బంగా తెలియజేసారు.