గతంలో సూపర్ హీరో సినిమాలని తూర్పార బట్టిన  కామెరాన్, అవెంజర్స్ ఎండ్ గేమ్ అవతార్ బాక్స్ ఆఫీస్ రికార్డు ను బద్దలు  కొట్టినప్పుడు కూడా అందరు అతను మరోసారి సూపర్ హీరో సినిమాలని ఏకిపారేస్తాడనుకున్నారు కానీ అందరి ఎక్సపెక్టషన్స్ కి బిన్నంగా కామెరాన్ , డిస్నీ మరియు మర్వెల్ సినీ జగత్తులో  రికార్డు బ్రేకింగ్ మైలురాయిని సాధించారని తన ట్విటర్ లో ట్వీట్ చేసి వారికి అభినందనలు తెలియజేశాడు.

అంతే కాకుండా కొన్ని ఇంటర్వ్యూలో  అవెంజర్స్  సిరీస్ సక్సస్ తనకి ఇంకా కొత్త ప్రయోగాలు చెయ్యడానికి చాలా దైర్యన్నీ ఇచ్చిందని చెప్పుకొచ్చాడు.

ఇటీవల డెడ్లైన్ అనే ఆంగ్ల పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో “ఎవెంజర్స్: ఎండ్‌గేమ్ సక్సెస్ ప్రజలు అద్భుతాలు చూడడానికి ఇప్పటికీ సినిమా థియేటర్లకు వెళ్తారనడానికి గొప్ప నిదర్శనం అని అయన అన్నారు.

అవతార్ 2 మరియు అవతార్ 3 ను నిర్మించడానికి  నన్ను ఎక్కువగా భయపెట్టిన విషయం, కొందరు  ఇండస్ట్రీ పెద్దలు 'ఇప్పుడు  మార్కెట్ చాలా మారిపోయిoదని, జనాలు ఉత్సాహంగా గతంలోలాగా సమూహంతో  కలిసి చీకటి గదిలో కూర్చుని  సినిమాలు చూడడంలేదని అనడం' చాలా భయ్యని కలిగించిందని అన్నారు.

ఇటీవలే 65 ఏళ్లు నిండిన కామెరాన్ తన కెరీర్‌లో ఇప్పటికి  కేవలం 10 చిత్రాలకి మాత్రమే  దర్శకత్వం వహించారు. మార్వెల్ తన స్థానాన్నిఅధికమించడానికి ముందు అతను ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు చేసిన చిత్రానికి దర్శకుడిగా 21 సంవత్సరాలు ఉన్నానని ఇప్పుడు వేరే సినిమాలు తన రికార్డ్స్ ని బ్రేక్ చెయ్యడం తనకేంబాధ అనిపించట లేదని చెప్పాడు.

Congratulations, @MarvelStudios! pic.twitter.com/DWZDX0uDVi

ప్రస్తుతం తాను అవతార్ 2, 3 భాగాలు నిర్మించే పనిలో వున్నాడని త్వరలో అవతార్ 4 మరియు 5 బాగాలకి ప్రీప్రోడుక్షన్ కూడా మొదలు పెట్టనున్నానని చెప్పుకొచ్చాడు.

“అవతార్ 2 మరియు 3 ఆ రకమైన విజయాన్ని సృష్టించగలవా? అన్న ప్రశ్నకు, ఎవరికీ తెలుసు... మేము ప్రయత్నిస్తున్నాము. బహుశాకావచ్చు  కాకపోవచ్చు, కాని విషయం ఏమిటంటే, ఇది అసాధ్యం మాత్రం కాదు”అని కామెరాన్ అన్నారు.

"ప్రత్యామ్నాయ సినిమాలకి విరుద్ధంగా, ఈ వేళా ప్రపంచంలో  సినిమాలు చూడటం కొత్తగా ఉంది, ఇక్కడ స్ట్రీమింగ్ సేవలు మరియు విభిన్న ప్లాట్‌ఫారమ్‌ల లో ప్రతి ఒక్కరూ సినిమాను సృష్టించగలిగే వేగవంతమైన వనరులు, డిజిటల్ ప్లాట్ఫారాల  లభ్యత మాత్రం ఇంతకూ ముందు లేదు".

"2009 లో మొట్టమొదటి అవతార్ చిత్రం విడుదలైనప్పుడు, చైనా మూవీ మార్కెట్ జస్ట్ ప్రారంభ దశలోఉండేది. కానీ ఇప్పుడు అది  ప్రపంచ రెండవ అతిపెద్ద మార్కెట్‌గా అవతరించింది. సో, చైనా మార్కెట్ అవతార్ సీక్వెల్స్‌ కి భారీగా తోడ్పడుతుందని భావిస్తున్నాను" అని అన్నారు.

కామెరాన్ మాట్లాడుతూ, స్ట్రీమింగ్‌ కంటెంట్ ను  నిర్మించడానికి అతను విముఖంగా లేనప్పటికీ, అతని దృష్టి అంతా థియేట్రికల్ అనుభవంపైనే  ఉందని, "నేను పెద్ద స్క్రీన్ బిసినెస్ లో ఉన్నాను కాబట్టి,  అది ఇంకా ఉనికిలో ఉంది కాబట్టి  నేను చాలా  సంతోషిస్తున్నాను" అని కామెరాన్ చెప్పారు. 

“మీరు వేరే ఏ విధంగా పాత్రల్లోకి ప్రవేశించగలిగే స్ట్రీమింగ్ కంటెంట్ చెయ్యను అని కాదు కానీ, నేను మీ ఫోన్‌ను ఆపివేసి, రెండున్నర గంటలు అందులో నిమగ్నమయ్యే పూర్తిగా అనుభవాన్ని సృష్టించడం పైనే  ఎక్కువ ఇష్టపడతాను అని అయన చెప్పారు.

అవతార్ 2 డిసెంబర్ 17, 2021 కి విడుదలకు నిర్ణయించగా, అవతార్ 3 డిసెంబర్ 2023 లో వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు.