కరణ్ జోహార్ 1998 లో బాలీవుడ్లో తన కెరీర్ ని ప్రారంభించాడు, అప్పుడు అతను కేవలం దర్శకుడు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా, అతను బహుముఖ ప్రజ్ఞాశాలి అయ్యాడు. సినిమాలను నిర్మించడం మొదలుకొని, చాట్ షోలను హోస్ట్ చేయడం వరకు, కరణ్ గత రెండు దశాబ్దాలుగా దాదాపు ప్రతి క్రియేటివ్ ఫీల్డ్ స్ ని ప్రయత్నించాడు.
ఇటీవల అతను OTT ప్లాట్‌ఫాం ఐన నెట్‌ఫ్లిక్స్‌తో తన నిర్మాణ సహకారాన్ని అందించనున్నట్లు ప్రకటించాడు.
కరణ్ జోహార్ కొత్తగా ఏర్పటు చేసుకున్న డిజిటల్ కంటెంట్ స్టూడియో "ధర్మాటిక్ ఎంటర్టైన్మెంట్" నెట్‌ఫ్లిక్స్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది.
ఇదే విషయాన్నీ తన అభిమానులతొ పంచుకుంటూ, కరణ్ జోహార్ ఈ క్రింది ట్వీట్ చేయారు కరణ్.
.@NetflixIndia is about to get @Dharmatic_ ! So excited about our exclusive collaboration with NETFLIX! We are creatively aligned to produce original feature films & series (fiction & nonfiction)...it’s going to be P.H.A.T! @apoorvamehta18 @NotSoSnob @aneeshabaig @DharmaMovies pic.twitter.com/cASar5Ycbr
— Karan Johar (@karanjohar) September 11, 2019
ట్వీట్‌తో పాటు, అతను 38 సెకన్ల వీడియోను కూడా షేర్ చేస్తూ ఇలా రాసాడు "కాబట్టి, మనమందరం రకరకాలా కథల ద్వారా పెరిగాము. మన జీవితాలను తలక్రిందులుగా చేసిన కథలు. నిజంగా ఆ పాత్రలు మనకు ఇచ్చిన ఎంటెర్టైన్ట్ ఎవర్ గ్రీన్. నా ఉద్దేశ్యంలో ఎవరు అలంటి పాత్రలను మర్చిపోగలరు? ఈ కొత్త ప్రయత్నం కూడా అలాగే ప్రెట్టీ, హాట్ అండ్ టెంప్టింగ్ అవుతుందని ఆశిస్తున్నా, కాబట్టి, సిద్ధంగా ఉండండి. "
ఇంతకు ముందు, కరణ్ జోహార్ 'లస్ట్ స్టోరీస్' కోసం నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి పనిచేశాడు, ఇప్పుడు అతను OTT ప్లాట్‌ఫామ్‌తో భాగస్వామ్యంలోకి ప్రవేశిస్తున్నాడు.
"నేను ఇప్పటికే చేస్తున్న ప్రాజెక్టుల గురించి మరియు, మీ ముందుకు తెస్తున్న కొత్త ప్రోజెక్టుల గురించి నేను చాలా సంతోషిస్తున్నాను. ప్రపంచం లోని విశ్వవ్యాప్త కథలను సృష్టించడం నమ్మశక్యం కాని, అపూర్వమైన అవకాశం ”అని కరణ్ జోహార్ ఈ ప్రకటనలో తెలిపారు.
"అపారమైన కథలు చెప్పే అవకాశాల గురించి మేము ఏంటో సంతోషిస్తున్నామని . ధార్మాటిక్ ఎంటర్టైన్మెంట్ కోసం కొత్త కథా గృహంగా నెట్‌ఫ్లిక్స్ ఉన్నందున, మేము కలిసి ఏమి చేయగలమో అనే దానిపై ఇంకా మాకు చాలా ఆలోచనలు, ఆశలు ఉన్నాయి" అని ధర్మ ప్రొడక్షన్స్ సిఇఒ అపూర్వా మెహతా అన్నారు.
"విభిన్న దృక్పథాలలో విభిన్నమైన కథలను సృష్టించడం, అది మీ దృష్టికి తీసుక రావడం మరియు నెట్‌ఫ్లిక్స్‌తో ప్రపంచానికి మరెన్నో గొప్ప ధారావాహికలను, చిత్రాలను రూపొందించడానికి మేము చాలా ఎక్ససీటింగ్ గా వున్నాము" అని ఆయన చెప్పారు.