Meera On Age Difference: పెళ్లి సమయానికి అతడికి 35, ఆమెకు 21. తమ ఇద్దరి మధ్య 14 వయసు వ్యత్యాసం ఉండటం పట్ల  షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్‌పుత్ ఏమని స్పందించిందో తెలుసా?

షాహిద్ కపూర్ మరియు మీరా రాజ్‌పుత్ కపూర్ పెళ్లి చేసుకున్నప్పటి నుండి అందరిలో ఒక్కటే ఉత్కంఠ. షాహిద్  చెయ్యి పట్టుకొని ముంబై విమానాశ్రయం నుండి బయటకు వచ్చినపుడు 21 ఏళ్ల మీరా పసి ముఖం మనకు ఇప్పటికీ అలానే గుర్తుంది.

గ్లామర్  మరియు గ్లిట్జ్ ప్రపంచం గురించి పెద్దగా ఆమెకు తెలియదు కాని ఆమె తన జీవితపు భాగస్వామ్య  నిర్ణయంలో మాత్రం 'మిసెస్ కపూర్' గా అందమైన ప్రపంచాన్ని నిర్మించడంలో చాలా సక్సెస్ అయ్యిందని ఒక వైపు, మరోవైపు ఆమె మొండి వైఖరి ప్రదర్శిస్తోందిని పలువురి గుసగుసలాడుతున్నందున, ఆమె ఈ కథనం ఆమె మాటాల్లోనే.

నాలుగు సంవత్సరాలు పాటు, మీరా షాహిద్ కపూర్‌తో కలిసి జీవితాన్ని సాగిస్తోంది, సాధారణంగా ప్రతి అమ్మాయి ఒక అందమైన భర్త, ఇద్దరు చిన్న పిల్లలతో కలిసుండాలని కలలు కంటుంది. కానీ ప్రపంచం ఆమెను 'ట్రోఫీ భార్య'గా ముద్ర వేసిo ది.

అయినప్పటికీ ఆమె మాత్రం తన నిజాయితీ గల అభిప్రాయాలతో, తన గురించి రుసరుస లాడే వారందరికి తన గుర్తింపు కేవలం స్టార్ భార్య మాత్రమే కాదని ప్రపంచo  విశ్వసించేలా జవాబిస్తోంది.

ఇటీవల, వోగ్ పత్రికకు ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో, మీరా చివరికి భర్త షాహిద్‌తో తన 14 సంవత్సరాల వయస్సు వ్యత్యాసం ప్రశ్నకు ఇలా సమాధానమిచ్చింది. "జీవితం పట్ల అతని దృక్పధం నేను ఇష్టపడే మరో గుణం. ఇది నాకు చాలా సహాయపడుతొoది.

అతను  నా కంటే ఎక్కువ కాలం జీవించాడు, కాబట్టి ఏదైనా ఉంటే, నేను అతని అనుభవంతో ప్రయోజనం పొందగలుగుతున్నానేకాని ఇందులో నాకు నష్టం ఏమీ లేదు. ఇక అతను నా తాజా ఆలోచనలు, మరియు దృక్పథం నుండి చాలా ప్రయోజనం పొందగలుగు తున్నాడు."

ఇదే ఇంటర్వ్యూలో, మీరా ముంబైలో తమ జీవితాన్ని ఎలా ఎంచుకున్నారో కూడా తెలియజేసింది (ఆమెది ఢిల్లీ, ముంబై  ప్రజల జీవితానికి పూర్తిగా భిన్నమైనది).

"నేను చాలా సవాళ్లను అధిగమించడానికి అసలు కారణం నేను వాటి గురించిపెద్దగా ఆలోచించకపోవడమె. ఢిల్లీ నుండి ముంబైకి వచ్చిన తనకు ....'మార్పు' వాస్తవానికి చాలా ఆహ్లాదకరంగా ఉంది అని చెప్పింది. నేను దక్షిణ బొంబాయిని చాలా ఎంజాయ్ చేస్తున్నాను. వాస్తవానికి, మేము మా పెళ్లి వార్షికోత్సవాన్ని కొలాబాలో, ది టేబుల్ వద్ద డిన్నర్తొ  జరుపుకున్నాము.

నేను ఇక్కడీ జీవన విధానం మరియు డ్రెస్సింగ్ విధానాన్ని కూడా బాగా అలవాటు చేసుకున్నాను. వివాహం చేసుకున్న తర్వాత మొదటిసారి చిరిగి పోయిన జీన్స్ ధరించాను"

షాహిద్, తాను కలిసి  'ఉడ్తా పంజాబ్ (2016)' చూస్తున్న టైం లో ఒకటైన ఇద్దరు ఒక ఆసక్తికరమైన సంఘటనను వెల్లడించారు. ముందుగా సాహిద్ మాట్లాడుతూ నేను, తను ఒకే సోఫాలో కూర్చుని థియేటర్ లో మూవీ చూస్తున్నాము ఇంటర్వల్ లో ఆమె నా నుంచి ఐదు అడుగుల దూరం (సోఫా లో మరొక అంచుకు)జరిగింది. నన్ను చూసి "నువ్వు నిజంగా అలాంటి వ్యక్తి కాదు కదా? అంది లేక ఉడ్తా పంజాబ్ లో లాంటి వ్యక్తి నీ లోపల ఎక్కడైనా ఉన్నాడా? అని ప్రశ్నించింది, అంతే కాకుండా "నేను నీకు ఇంకా దూరంగా వున్నప్పుడే చెప్పు ఇటు నుంచి ఇటే ఇంటికి  వెళ్లి పోతా అంది." అప్పుడు "నా మనస్సులో ఉన్న ఏకైక ఆలోచన, 'కేవలం మెం ఇద్దరం మాత్రమే, థియేటర్ లో ఆ రెండు పెద్ద సోఫాలపై 2 గంటలు కూర్చుని ఉన్నాం. ఇది ఇలాగే ఇంకో 15 నిమిషాలు పాటు కొన సాగితే చాలురా భగవంతుడా అని మాత్రం అనిపించింది.'"

వారి ప్రేమకథ ను కంటిన్యూ చేస్తూ షాహిద్ "నేను మొదటిసారి ఆమె ఇంటికి టామీ జోన్లో వెళ్ళాను (డ్రెస్). నాకు పోనీటైల్, డ్రాప్-క్రోచ్ ట్రాక్ ప్యాంటు మరియు విచిత్రమైన బూట్లు ఉన్నాయి. నేను కారులోంచి అలానే ఢిల్లీ లోని మీరా ఫామ్‌హౌస్‌లో దిగిన తరువాత నాకు గుర్తుకు వచ్చింది. నేను ఎలాంటి అవతారం లో పెళ్లి చూపులకి వచ్చానో అని. అలా నను చూసిన ఆమె తండ్రి నా వైపు చూసి చూడనట్టు 'లోపలికి రండి' అని అయిష్టంగా వెళ్ళిపోయాడు. "

ఒక సారి, "ఆమె ఎల్ఎస్ఆర్ కాలేజీ నుండి బయటకు వస్తున్నప్పుడు, ఈ 20 ఏళ్ళ కాంఫుజ్డ్ అమ్మాయి కి నేను టామీ అనే పాత్రను పోషిస్తున్నానని చెప్పినప్పుడు, ఆమె 'అది ఒక వ్యక్తి పేరు కాదు, కుక్క పేరు అంది' అని నవ్వుతూ చెప్పుకొచ్చాడు షాహిద్.

తరువాత మీరా అరేంజ్డ్ మ్యారేజ్ గురించి మాట్లాడుతూ " తమది ఎందుకు అరేంజ్డ్ మ్యారేజ్ కాదు? అరేంజ్డ్ మ్యారేజ్ అంటే మీరు ఒకరిని ఒకరు ఏదో విధంగా కలవాలి,కలిసి మాట్లాడుకోవాలి, అన్ని నచ్చితే పెళ్లి చేసుకోవాలి! ఇది మాకు చాలా అందంగా ఆల్రెడీ వర్క్ అవుట్ అయ్యింది కదా? అని చెప్పుకొచ్చింది.

ఎందుకంటే మా ఇద్దరికీ మా గురించిన అభిప్రాయలు చాలా బలంగా మరియు బహిరంగంగా ఉన్నాయి. కాబట్టి వివాహం జరిగిన తరువాత వేరే రకమైన కొత్త  ఆవిష్కరణలు జరిగినా మేం వాటికి సిద్ధంగానే వున్నాం.

నేను తీసుకోవలసిన పాత్రను నేను అర్థం చేసుకున్నాను, అతను (షాహిద్) తన సగ భాగం తను అర్థం చేసుకున్నాడు. మెం ఇద్దరూ ఇలా ఒకరినొకరు ముందే అర్తం చేసుకున్నాం కనుక ఇప్పుడు పూర్తి పరిపక్వoతో మరింత ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నాము అని సమాధానం ఇచ్చి ముగించింది మీరారాజపుట్ కపూర్.

(Image courtesy: Instagram)