Telugu Movies Releasing This Month: ఈ నెలలో రిలీజ్ కి రెడీ అవుతున్న 'కొత్త'  తెలుగు సినిమాలు - గ్యాంగ్ లీడర్, వాల్మీకి

గ్యాంగ్ లీడర్, వాల్మీకి ల లో ఏముంది, వాటి ఎక్సపెక్టషన్స్ ని  ఒక్క సారి పరిశీలిద్దాం.  

నాని,  విక్రమ్ కుమార్ 'గ్యాంగ్ లీడర్' - కామెడీ థ్రిల్లర్.  వరుణ్ తేజ్, హరీష్ శంకర్ -'వాల్మీకి' ఆక్షన్ కామెడీ.

ప్రజలకి ఆన్లైన్ ఎంటర్టైన్మెంట్ ఎక్కువయ్యే కొద్దీ  మన సినిమా డైరెక్టర్లు, ప్రేక్షకులని థియేటర్లకి రప్పించడానికి పడుతున్న తిప్పలు అన్ని ఇన్ని కావు. కొత్త కొత్త ప్రయోగాలు చేస్తు కథలు రాస్తున్నారు. ఇంతకు ముందు ఎన్నడూ తెలుగు సినిమాలో లేని జోనర్లన్నీ పట్టుకొస్తున్నారు - ఆక్షన్ కామెడీ, థ్రిల్లర్ కామెడీ, హారర్ కామెడీ, ఫ్యాక్షన్ కామెడీ... వారు ఏ జోనర్ ఎంచుకున్నా దానికి కామెడీ తగిలిస్తున్నారు. బహుశా ఎంటర్టైన్మెంట్ కామెడీ లోనే వుంది అని ఇంకా వారి ప్రగాఢ విశ్వాసం కావచ్చు కాబోలు.  

వాల్మీకి 2014 లో వచ్చిన తమిళ సినిమా 'జిఘర్ తాండా' కి రీమేక్. అంతలా రీమేక్ చెయ్యడానికి అందులో ఏముందా? లేదా  వీరెలా రీమేక్ చేశారో? అని ప్రేక్షకులు చూసే అవకాశం వుంది. 

ఇక గ్యాంగ్ లీడర్ విషయానికొస్తే, అఖిల్ తో 2017 లో 'హలో' తీసి  ప్లాప్ చవిచూసిన తరువాత విక్రమ్ చాలా ఫోకస్డ్ గా తీస్తున్న సినిమా కాబట్టి 'గ్యాంగ్ లీడర్ని' కొంచం కసిగానే తీసుంటాడు అని చూసే అవకాశం ఉంది. సో,  లెట్స్ వెయిట్ అండ్ వాచ్ టిల్ 20 సెప్టెంబర్.