Bigg Boss Tamil Season 8

Chennai, SEP 04: బిగ్‌బాస్‌ ఎనిమిదో సీజన్‌కు (Bigg boss 8 tamil) రంగం సిద్ధమైంది. అదేంటి? ఆల్‌రెడీ మొదలైంది అంటారా! అవును, తెలుగులో మూడు రోజుల ‍క్రితమే లాంచ్‌ అయింది. ఇప్పుడు చెప్పుకోబోయేది తమిళ బిగ్‌బాస్‌ గురించి! అక్కడ కూడా ఏడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న తమిళ బిగ్‌బాస్‌ ఎనిమిదో సీజన్‌ షురూ కానుంది.

Here's Promo

 

 

View this post on Instagram

 

A post shared by Vijay Television (@vijaytelevision)

అయితే ఇప్పటివరకు కమల్‌ హాసనే షో వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. కానీ ఈసారి హోస్టు మారాడు. విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) రంగంలోకి దిగాడు. ఈ విషయాన్ని బిగ్‌బాస్‌ టీమ్‌ (Bigg Boss) అధికారికంగా ప్రోమో ద్వారా వెల్లడించింది.

Telugu States Rains: వరద బాధితులకు సోనూసూద్ సాయం, ధన్యవాదాలు తెలిపిన సీఎం చంద్రబాబు, ఆంధ్రా, తెలంగాణ ప్రజలు నా కుటుంబం సార్ అంటూ బదులిచ్చిన సోనూ 

విజయ్‌ సేతుపతి బిగ్‌బాస్‌ హోస్టింగ్‌ చేస్తున్న విషయం తెలిసిన అభిమానులు ఎగిరి గంతేస్తున్నారు. సేతుపతికి గతంలో మాస్టర్‌ చెఫ్‌ షో హోస్ట్‌ చేసిన అనుభవం ఉంది. కాబట్టి అతడు బిగ్‌బాస్‌ను కూడా రఫ్ఫాడించడం ఖాయంగా కనిపిస్తోంది. బిగ్‌బాస్‌ తమిళ్‌ ఎనిమిదో సీజన్‌ విజయ్‌ టీవీలో ప్రసారం కానుంది. అలాగే హాట్‌స్టార్‌లో 24 గంటల లైవ్‌ కూడా చూడొచ్చు.