Anasuya Bharadwaj (Photo Credits: Twitter)

జబర్దస్త్ కామెడీ షోలో చాలా మంది ఉంటారు కానీ హైపర్ ఆది, అనసూయ మధ్య ఉండే కెమిస్ట్రీ మాత్రం చాలా స్పెషల్. నిజానికి వాళ్లిద్దరి మధ్య ఆకాశం, నేలకు ఉన్నంత తేడా ఉంటుంది. కానీ తన ప్రతీ స్కిట్ కోసం అనసూయను వాడేస్తుంటాడు ఆది. లేదంటే అనసూయ కూడా అసూయ పడేలా మరో అమ్మాయిని తీసుకొస్తుంటాడు. ఇదే సక్సెస్ ఫార్ములాతో అలా వెళ్లిపోతున్నాడు ఈయన. అప్పుడప్పుడూ ఆది స్కిట్స్ కోసం వేసే పంచులు.. రాసుకునే డైలాగులు బయట కూడా బాగానే పాపులర్ అవుతుంటాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. తన స్కిట్ కోసం రాసుకున్న మాటల్లోనే అనసూయపై అదిరిపోయే సెటైర్లు వేసాడు ఈ కమెడియన్. అయితే ఈ మధ్య కాలంలో హైపర్ ఆది అనసూయ విషయంలో కాస్త తగ్గినట్టుగానే కనిపిస్తోంది.

ముఖ్యంగా హైపర్ ఆది ఈ మధ్య కాలంలో తన స్కిట్స్ లో ఆమెను చూపించడం కాస్త తగ్గించేశాడు. అందుకు కారణం లేకపోలేదు. ఇప్పటికే జబర్దస్త్ స్కిట్స్ లో మరో కొత్త జంట ఎంట్రీ ఇచ్చింది. అదే ఇమ్మాన్యువల్, యాంకర్ వర్ష అనే చెప్పాలి. ఇద్దరూ కలసి తెగ రొమాన్స్ పండించేశారు. అయితే అటు అనసూయ, ఇటు రష్మీ సైతం యాంకర్ వర్ష వైపు కాస్త జెలసీ ఫీల్ అవుతున్నారనే చెప్పాలి. దీంతో హైపర్ ఆది ప్రస్తుతం మరో సారి అనసూయతో కలిసి పులిహోర కలిపేందుకు ప్రయత్నం చేస్తున్నాడు.

Ex-Student Stabs Teacher: 30 ఏళ్ల క్రితం అవమానించినందుకు టీచర్‌ ను చంపేసిన స్టూడెంట్, 101 కత్తిపోట్లు పొడిచి కిరాతకంగా హతమార్చిన విద్యార్ధి, 16 నెలల పాటూ గాలించి పట్టుకున్న బెల్జియం పోలీసులు

అటు ఢీ షోలో దీపిక పిల్లి కూడా తప్పుకోవడంతో హైపర్ ఆదికి మరోసారి పులిహోర కలిపేందుకు అనసూయనే దిక్కు అయ్యింది. దీంతో అనసూయ మాత్రం హైపర్ ఆదిని తన దగ్గరకు రావద్దు అంటూ హెచ్చరిస్తోంది. అందుకు కారణం లేకపోలేదు. దీపికా పిల్లి ఉన్నంత కాలం తనను పట్టించుకోని హైపర్ ఆది, ఇప్పుడు అమాంతం తన వద్దకు రావడం పట్ల అనసూయ కాస్త అసహనంగానే ఉంది.

అయితే హైపర్ ఆదికి మాత్రం అటు అనసూయ తప్ప ఇప్పుడు మరో దిక్కు లేకుండా తయారు అయ్యింది. అటు ఇమ్మాన్యువల్ వర్ష రొమాన్స్ తో దూసుకెళ్తుంటే..హైపర్ ఆది మాత్రం వెనుకబడ్డట్టే కనిపిస్తోంది. అయితే ఇమ్మాన్యువల్ కూడా తొందర పడకుండా తన కెరీర్ బిల్డ్ చేసుకుంటున్నాడు. కాగా హైపర్ ఆది ఇటీవల తన వద్దకు వచ్చి కాస్త క్లోజ్ అవ్వాలని చూడగానే అనసూయ కాస్త సీరియస్ అయినట్లు తెలుస్తోంది. గతంలో లాగా హైపర్ ఆది పప్పులేవీ ఉడకవని అర్థం అవుతోంది.