Bigg Boss OTT Telugu (Image: Youtube Still Grab)

బిగ్ బాస్ తెలుగులో ఐదు సీజన్లు పూర్తిచేసుకోగా ఆరవ సీజన్ కు ఇంకా టైం ఉంది. అయితే.. ఈ మధ్యలోనే ఓటీటీ తొలి సీజన్ మొదలుకానుంది. ఇప్పటికే ఈ మేరకు నాగార్జున అధికారికంగా ప్రకటించగా దానికి కూడా ఆయనే హోస్ట్. ఓటీటీ బిగ్ బాస్ తొలి సీజన్ కోసం ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక కూడా మొదలైనట్లు తెలుస్తుంది. ఇప్పటికే వీళ్ళే ఓటీటీ తొలి సీజన్ కంటెస్టెంట్లు అంటూ కొందరి పేరు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇదిలా ఉండగానే బిగ్ బాస్ తెలుగు ఓటీటీ తొలి సీజన్ ప్రోమో కూడా వచ్చేసింది. హోస్ట్ నాగార్జున లాయర్ గా.. వెన్నెల కిషోర్ ఖైదీగా షూట్ చేసిన ఈ ప్రోమోతో 24 గంటల పాటు బిగ్ బాస్ షో ప్రసారం కానుందని చెప్పేశారు. డిస్నీ హాట్ స్టార్ లో ఈ షో ప్రసారం కానుండగా.. ఫిబ్రవరి 26 నుండి ఈ ఓటీటీ షో మొదలవుతుందని కన్ఫర్మ్ చేశారు.

కాగా, ఓటీటీ తొలి సీజన్ కు హైప్ తెచ్చేందుకు గతంలో బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లను రంగంలోకి దింపనున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా.. పాత కొత్త కంటెస్టెంట్ల కలయికలో ఈ ఓటీటీ తొలి సీజన్ బిగ్ బాస్ షో ప్లాన్ చేస్తున్నట్లు తాజాగా సమాచారం. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అరియనాతో పాటు మాజీ కంటెస్టెంట్లు ఆదర్శ్, తనీష్, అఖిల్, అలీ రెజా, హరితేజలు కూడా ఓటీటీ బిగ్ బాస్ తొలి సీజన్ లో ఇంట్లోకి వెళ్లేందుకు సిద్దమైనట్లు వినిపిస్తుంది.

ఇక, కొత్తగా.. యాంకర్‌ వర్షిణి, యాంకర్‌ శివ, డ్యాన్స్‌ షో ‘ఢీ-10’ విజేత రాజు, టిక్‌టాక్‌ స్టార్‌ దుర్గారావు, ‘సాఫ్ట్‌వేర్‌ డెవలపర్స్‌’వెబ్‌ సిరీస్‌ ఫేమ్‌ వైష్ణవి, సోషల్‌ మీడియా స్టార్‌ వరంగల్‌ వందన, యాకర్‌ ప్రత్యూష పేర్లు ఓటీటీ బిగ్ బాస్ కంటెస్టెంట్లుగా వినిపిస్తున్నాయి. వీరందరికీ ఒకటి రెండు రోజులలో క్వారంటైన్ కూడా మొదలు కానుండగా ఫిబ్రవరి చివరి వారంలో షో మొదలు పెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్లకు కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ చేయించి క్వారంటైన్ చేయనున్నట్లు తెలుస్తుంది.