గాజువాక కు చెందిన లేడీ కండక్టర్ ఝాన్సీ ప్రస్తుతం ఇంటర్నెట్ ప్రపంచంలో వైరల్ గా మారింది. ఈ అమ్మడు తాజాగా శ్రీదేవీ డ్రామా కంపెనీలో పల్సర్ బైక్ పాట చేసింది. కేవలం ఒక్క పాటకు డాన్స్ చేసి ఓవర్ నైట్ సెలబ్రిటీ హోదా దక్కించుంది. అంతేకాదు ఇంటర్నెట్ లో ఆర్టీసీ ఝాన్సీగా గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఉద్యోగం విషయానికొస్తే ఆమె గాజువాక బస్ డిపోలో కండక్టర్ అయినప్పటికీ, డాన్స్ మీద ఇష్టంతో ఈవెంట్లలో డాన్సులు చేస్తోంది. ఇప్పటికే 1500 ప్రదర్శనలు ఇచ్చింది.
శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో డాన్స్ చేసే అవకాశం దక్కించుకున్న ఈ అమ్మడు. మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ టైం షోలో అడుగు పెట్టింది. ఆ ఎపిసోడ్లో తన పర్ఫామెన్స్ ను అదరగొట్టింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో పల్సర్ బైక్ సాంగ్ ద్వారా ఝాన్సీ ప్రస్తుతం నెంబర్ వన్ ట్రెండింగ్ స్టానానికి చేరింది.
ఈ పాటకు ఝాన్సీ ఒక రేంజ్ లో ఆడిందని చెప్పవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను మరో స్థాయిలో ఆశ్చర్యపరిచింది. మొత్తానికి ఝాన్సీ ఈ పాటతో ఊహించని స్థాయిలో గుర్తింపు సంపాదించుకుంది. మరిప్పుడు ఆ పాటను మించి పోయే విధంగా మరోసారి అదే షోలో దుమ్ము రేపింది. వెంటపడి వచ్చేవాళ్లు కుర్రాళ్ళు అంటూ ఝాన్సీ ఆడి పాడింది.
ప్రస్తుతం ఝాన్సీ చేసిన డాన్స్ యూట్యూబ్లో వైరల్ గా మారింది. అయితే చిన్నతనంలో ఎన్నో కష్టాలను పడ్డ ఝన్సీ డాన్సర్ గా ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. అంతేకాదు తాను డాన్సు చేసే సమయంలో చాలా మంది అవమానించినట్లు తెలిపింది. తనను ఎంత మాటలు అన్నా కన్నీళ్లు కార్చుకుంటేనే డాన్సు చేసినట్లు తెలిపింది. ఒక్కోసారి స్టేజీ మీదకు వచ్చి తనను తాకాలని ప్రయత్నం చేసేవారని చెప్పుకొచ్చింది. రికార్డింగ్ డాన్సులు చేయడం కూడా ఒక కళే అని కళాకారులను అవమానించకూడదని ఝాన్సీ కన్నీల్లు పెట్టుకుంది.