Jabardasth Apparao: జబర్దస్త్‌లో నాకు చాలా అవమానం జరిగింది, కన్నీళ్లు పెట్టుకున్న అప్పారావు, 30 ఇయర్స్  సీనియారిటీని పట్టించుకోలేదు...
Jabardasth Apparao ( Image: Youtube)

జబర్దస్త్ షో ద్వారా ఎవరూ ఊహించని విధంగా తన కామెడీతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. అలా సంపాదించుకున్న కమెడియన్ల లో కమెడియన్ అప్పారావు గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ జబర్దస్త్ షో వల్ల ఈయనకు ఎన్నో సినిమాలలో నటించే అవకాశాలు వెలువడ్డాయి. అయితే గత కొన్ని నెలలుగా అప్పారావు జబర్దస్త్ లో కనిపించడం లేదు. అయితే ఈ షో ఎందుకు మానేశాడు అనే విషయాన్ని స్వయంగా తెలియజేయడం జరిగింది వాటి గురించి చూద్దాం.

జబర్దస్త్ షో ఎంతోమందికి తన లాంటి వాళ్ళకి లైఫ్ ఇచ్చింది అని తెలియజేశారు. అలాంటి షో ను ఎవరూ సర్వసాధారణంగా వదులుకోరని తనకంటే ముందు నాగబాబు షో ని వదిలి వెళ్లారని అప్పారావు తెలిపారు. అయితే మనం దేని నమ్ముకున్నామో.. దేనిని ఇష్టపడ్డామో.. దానిని వదులుకోవాలంటే దానికి ముఖ్యమైన కారణం కూడా ఉంటుందని తెలిపారు. జబర్దస్త్ లో ప్రాక్టీస్ కు, ఎపిసోడ్ కు కూడా ఒక్క రోజు కూడా మానేయ్ లేదని.. తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ కు అంత ప్రాధాన్యత ఇచ్చేవాడిని తెలియజేశారు అప్పారావు. రెండు రోజులు ప్రాక్టీస్, మరొక రెండు రోజులు షూటింగ్ ఉంటుందని.. ఆ షో అంటే తనకి సినిమా రిలీజ్ అయిన ఆనందం కలుగుతుందని అప్పారావు తెలియజేశారు.

జమ్ముకశ్మీర్‌లో కూలిపోయిన ఆర్మీ చీతా హెలికాప్టర్‌, పైలట్‌, కో పైలట్‌ పారాచూట్‌ ద్వారా బయటపడినట్లు వార్తలు, వారిని గాలిస్తున్న ఆర్మీ రెస్క్యూ బృందాలు

కరోనా సెకండ్ వేవ్ తర్వాత.. తనకి ఎక్కువ వయసు ఉండడంతో రిస్కు ఎక్కువని.. మేనేజ్మెంట్ కొన్నిరోజులు తనని ఆగమని చెప్పారని..బుల్లెట్ భాస్కర్ తనతో చెప్పాడట. ఇక అలాంటి సమయంలో తను కూడా ఆ మాటలు నమ్మానని అప్పారావు తెలియజేశారు. ఇక ఆ తర్వాత బుల్లెట్ భాస్కర్ దగ్గర చేసే స్కిట్ లలో క్రమక్రమంగా తన ప్రాధాన్యత తగ్గిపోతూ వస్తోంది అని చాలా బాధపడ్డా అని తెలియజేశారు.

తను ఒక సీనియర్ స్ట్రాంగ్ కంటెంట్ అయినా కూడా తన ప్రాధాన్యత తగ్గించారని ఆయన తెలియజేశారు. ఇక దాదాపు 30 ఏళ్ల స్టేజ్ పైన ఆర్టిస్టుగా తన అనుభవం ఉందని తెలిపారు. ఆ తర్వాత బుల్లెట్ భాస్కర్ టీమ్ లో చేరాను అప్పారావు తెలియజేశారు. ఇక ఆ తర్వాత తన నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ కావాలని అడిగితే.. వాళ్లు వెంటనే ఇచ్చారని అప్పారావు తెలిపారు. ఎందుకు షో మానేస్తున్నారు అని కూడా జబర్దస్త్ మేనేజ్ మెంట్ అడగక పోవడంతో చాలా ఫీల్ అయ్యాను అని అప్పారావు తెలిపారు.