Big Boss 3 launch: అట్టహాసంగా ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్-3, మొత్తం 15 మంది కంటెస్టెంట్లు. ఒక్కొక్కరి గ్రాండ్ ఎంట్రీలతో ఆరంభం అదిరింది.

అనుకున్న సమయానికి, అనుకున్న విధంగా భారీ అంచనాలతో తెలుగు బిగ్ బాస్ 3 వచ్చేశాడు. ఏదైనా పెద్ద సినిమా లేదా అవార్డ్ ఫంక్షన్ చూస్తే ఎలా ఉంటుందో దానికి ఏమాత్రం తీసిపోకుండా 'స్టార్ మా' ఛానల్ ఈ షో ప్రారంభోత్సవాన్ని భారీగానే తీర్చిదిద్దింది.

ఈ రియాల్టీషో పట్ల ఎప్పుడూ ఎన్నో వివాదాలు. సీజన్ 3 ప్రారంభానికి ముందు కూడా ఇందులో స్థానం దక్కించుకోలేని ఒక యాంకర్ మరియు ఒక నటి ఈ షో నిర్వాహకులపై పోలీసు కేసులు పెట్టారు. మరోవైపు ఈ షో నిలిపివేయాలంటూ ధర్నాలు, ఓయూ విద్యార్థుల నుంచి హెచ్చరికలు వచ్చాయి. అయినప్పటికీ అన్ని అడ్డంకులు దాటుకొని బిగ్ బాస్ సీజన్3 వచ్చేసింది.

అందరి అంచనాలకు తగినట్లుగానే బిగ్ బాస్ 3 హోస్ట్ గా కింగ్ నాగార్జున మెస్మరైజ్ చేశారు. తనకు ఈ రియాల్టీషో ఇష్టం లేకపోయినా, ప్రేక్షకులకు ఇష్టం వారికోసం ఆట చూద్దాం అని స్టార్ట్ చేసి, అప్పటివరకు తనపై ఉన్న విమర్శలను ఇండైరెక్ట్ గా తిప్పికొడుతూ సీజన్-3ని ప్రారంభించారు. హౌజ్ ఎలా ఉంది, దాని విశేషాలు చెప్పి ఒక్కొక్క కంటెస్టెంట్ ను పరిచయం చేసుకుంటూ పోయారు.

బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్స్ వరుసగా...

1) శివజ్యోతి (తీన్మార్ సావిత్రి). మొదటి కంటెస్టెంట్ గా న్యూస్ యాంకర్ శివజ్యోతిని పరిచయం చేశారు. శివజ్యోతి విశేషాలు తెలుపుతూ ఆమెపై చిత్రీకరించిన ప్రత్యేక వీడియో చాలా సహజంగా, ఆకట్టుకునేలా ఉంది.

2) రవికృష్ణ - సీరియల్ నటుడు.

3) ఆశూ రెడ్డి - సోషల్ మీడియా ఫేమ్, డబ్ స్మాష్ వీడియోలతో పాపులర్ అయింది.

4) టీవీ జర్నలిస్ట్ జాఫర్. తనదైన శైలిలో ముఖాముఖి ఇంటర్వ్యూలు నిర్వహించే జాఫర్, చాలా మందికి సుపరిచితం. ఈయనపై తీసిన ప్రత్యేక వీడియో కూడా ఆకట్టుకుంటుంది.

5) హిమజ - టీవీ నటి, చాలా గ్లామరస్ ఎంట్రీ ఇచ్చింది.

6) రాహుల్ సిప్లిగంజ్- టాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్. హైదరాబాదీ ర్యాపర్.

7) రోహిణి - టీవీ యాక్టెస్, కమెడియన్

8) బాబా భాస్కర్ - సీనియర్ కొరియోగ్రాఫర్. ఫిల్మ్ ఫేర్ అవార్డ్ కూడా అందుకున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ 'మరణ మాస్' సాంగ్ తో హౌజ్ లో ఎంట్రీ ఇచ్చారు. ఈయనది తమిళ నేపథ్యం.

9) పునర్నవి భూపాలం- సినిమా యాక్ట్రెస్, హీరోయిన్ గా కూడా చేసింది.

10) హేమ - సినిమా నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్. 'మా' అసోసియేషన్ మెంబర్.

11) అలీ రేజా- మోడెల్ మరియు సినిమా యాక్టర్.

12) శ్రీముఖి- ఎనర్కిటిక్ యాంకర్, ఎన్నో లైవ్ ఈవెంట్స్, టీవీ షోలతో చాలా పాపులర్

13) మహేశ్ విట్ట - యాక్టర్, యూట్యూబ్ లో ఎన్నో వెబ్ సిరీస్ లలో నటించాడు. రాయలసీమ యాసతో ఆకట్టుకుంటాడు.

14 & 15) వరుణ్ సందేశ్- వితిక శెరు- సినిమాల్లో హీరోహీరోయిన్లు, నిజజీవితంలో భార్యాభర్తలు. బిగ్ బాస్ హౌజ్ లో భార్యాభర్తలు కంటెస్టెంట్లుగా రావడం ఇదే తొలిసారి.

2 గంటల పాటు సాగిన ఆరంభ ఎపిసోడ్ లో అందరి కంటెస్టెంట్ల పరిచయాలు అయిపోయాయి. ఇక వీరే 100రోజుల పాటు 'బిగ్ బాస్' ఇంట్లో గడపాలి. ఈ సీజన్ 3లో ఏం జరగబోతుంది, విజేతగా ఎవరు నిలుస్తారో పోనుపోనూ మీకే తెలుస్తుంది.