ఇక నుంచి రోజు రాత్రి 10:30 వరకు టీవీలకు అతుక్కుపోవాల్సిన పనిలేదు. తెలుగు టెలివిజన్ స్క్రీన్‌పై ఐపీఎల్ లాంటి కిక్ ఇచ్చే మెగా ఎంటర్టైన్ మెంట్ లీగ్ బిగ్ బాస్ సీజన్ 3 (Big Boss 3) ముగిసింది. ఈ సీజన్ (Season 3) కు హైదరాబాదీ అస్లీ మాల్ రాహుల్ చిచ్చా (Rahul Chicha) అలియాస్ రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) టైటిల్ విన్నర్‌గా నిలిచాడు. టాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్ అయిన రాహుల్ సిప్లిగంజ్, తెలుగులో ఎన్నో మాస్, ఎనర్జిటిక్ సాంగ్స్ పాడాడు.
టాలెంట్ ఎవరి సొత్తు కాదు అని చెప్పటానికి రాహుల్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, అతడెప్పుడు అవకాశాల కోసం ఎదురు చూడలేదు, అవకాశాలే తనను వెతుక్కుంటూ వచ్చేలా తనకంటూ సొంత ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. తన టాలెంట్‌ను సరిగ్గా వినియోగించుకుంటూ సొంతంగా పాటలు రాసుకొని, మ్యూజిక్ కంపోజ్ చేసి, పక్కా హైదరాబాదీ, తెలంగాణ స్లాంగ్‌లో రాహుల్ పాడిన పాటలు యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఆ పాటలతోనే రాహుల్ ఎంతో పాపులర్ అయ్యాడు, ఈరోజు బిగ్ బాస్‌లో రాహుల్‌కి అన్ని ఓట్లు పడటానికి కారణం ఎక్కడో మారుమూల ప్రాంతంలో కూడా అతడి పాటలకు ఫ్యాన్స్ ఉండటమే. తనదైన యూనిక్ వాయిస్‌తో రాహుల్ పాడే పాటలు, మ్యూజిక్ లవర్స్‌కు ఒక వైవిధ్యమైన మ్యూజిక్ ఫ్లేవర్‌ను అందిస్తాయి. రాహుల్ సిప్లిగంజ్ కంపోజ్ చేసి, పాడిన 'ఐ యామ్ ఎ పూర్ బాయ్' పాట విని, తన 25 ఏళ్ల అనుభవాన్ని ఈ ఒక్క పాటతో రాహుల్ అందుకున్నాడని టాలీవుడ్ దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి అన్నారంటే అర్థం చేసుకోవచ్చు, రాహుల్ కంపోజ్ చేసే సాంగ్స్ ఏ రేంజ్‌లో ఉంటాయనేది.
రాహుల్ సిప్లిగంజ్ కంపోషన్‌లో వచ్చిన కొన్ని టాప్ ఇండిపెండెంట్ మ్యూజిక్ ట్రాక్స్
Daawath Song
Maakkikirkiri Song
Poor Boy Song
Galli Ka Ganesh Song
Hijra Song
Mangamma Song
Pressure Cooker Movie Promotional Song
Doorame - Melody
Magajaathi Song
ఇవన్నీ రాహుల్ సిప్లిగంజ్ కంపోజ్ చేసిన చార్ట్ బస్టర్స్, ఇక టాలీవుడ్‌లో జోష్ సినిమాలో కాలేజి బుల్లోడా ఖలేజా ఉన్నోడా నుంచి మొదలు పెట్టి, రంగా రంగా రంగస్థలానా, గ్లాస్ మేట్స్, బొంబాట్, ఇస్మార్ట్ బోనాలు, పెద్దపులి లాంటి ఎన్నో మాస్ హిట్స్ పాడాడు. బిగ్ బాస్ 3 విజేతగా నిలిచిన సందర్భంగా మరోసారి 'లేటెస్ట్‌లీ తెలుగు' అతడికి శుభాకాంక్షలు తెలుపుతుంది. ఇక ముందూ ఇలాంటి మరెన్నో సాంగ్స్ రాహుల్ నుంచి రావాలని కోరుకుంటోంది.