Syeraa vs Baahubali: బాహుబలి రికార్డ్స్ ని సైరా నరసింహారెడ్డి బ్రేక్ చేస్తుందా?  సినిమా నిర్మాణం నుంచి ప్రమోషన్స్ వరకు అన్నింటిలో  బాహుబలితో 'సై' అంటూ పోటీ పడుతున్న మెగా మూవీ!

ఇప్పటివరకు రిలీజైన సినిమా టీజర్లలో యూట్యూబ్‌లో ఎక్కువ మంది చూసింది బాహుబలి-2 టీజర్‌నే, ఆ తరువాత వరుసలో సాహూ టీజర్ ఉంది. అలాగే ఇటీవల రిలీజైన మెగాస్టార్ చిరంజీవి ప్రిస్టీజియస్ "సైరా" టీజర్‌కు కూడా భారీగానే వ్యూస్ వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి సినిమాను ప్రభాస్ సినిమాతో పోల్చడం అవసరం లేనప్పటికీ. ఒకప్పుడు మొత్తం టాలీవుడ్ నే శాసించిన స్టార్ హీరో, అమితాబ్ బచ్చన్ కంటే ఎక్కువ మార్కెట్ కలిగిన హీరో  చిరంజీవి.  కాగా, ప్రస్తుత కాలంలో బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ కూడా ఆ ఖ్యాతిని సంపాదించారు. కాబట్టి సినిమా విశ్లేషకులు, హీరోల అభిమానులు బాహుబలి - సైరా సినిమా రికార్డుల గురించి  ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు.

అయితే 'సైరా' మూవీ టీజర్‌ను యూట్యూబ్‌‌లో పెయిడ్ ప్రమోషన్ చేస్తున్నారు అందుకే వ్యూస్ వస్తున్నాయంటూ విమర్శించే వాళ్ళూ ఉన్నారు.

సాధారణంగా ఏదైనా సినిమా రిలీజ్ అయిన తరువాత "సినిమా హిట్" అని ప్రమోట్ చేయటానికి ప్రొడ్యూసర్లు, సినిమా ప్రమోటర్లు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ‌ వచ్చిన దానికంటే ఎక్కువగా చెప్పుకుంటారనేది ఫిల్మ్ నగర్‌లో బహిరంగ రహస్యం.  ఇక టీజర్‌కి కూడా ఇలా  పెయిడ్ వ్యూ స్ తెచ్చుకుంటే, నిజమైన తెలుగు సినిమా స్థాయి, హీరో స్టామినా తెలిసేదెలా అని కొందరి వాదన.

అందుకే, సైరా నరసింహారెడ్డి  బాహుబలి రికార్డ్స్ ని కొట్టి మెగాస్టార్ అనిపించుకుంటాడా? లేక  బాహుబలి కలెక్షన్ల ని చూసి వాత పెట్టుకుంటున్నాడా? అని పెద్ద సందేహం నెలకొంది కొంతమందికి.  

సైరా సినిమా చూస్తుంటే పక్క ప్లాన్ తో బాహుబలి రికార్డులు అన్నింటిని  కొట్టేయాలని చాలా కసితో భారీ బడ్జెట్ తో, ప్రతి ఇండస్ట్రీ నుండి ఒక గుర్తింపు వున్న నటుడ్ని తీసుకున్నారు...

Chiranjeevi - టాలీవుడ్ 

Sudeep - శాండల్వుడ్

Vijay Sethupathi - కోలీవుడ్

Nayantara - మోలీవుడ్

Ravi Kishan - భోజపురి

Amitabh Bachchan - బాలీవుడ్

Tamannaah - పాన్ ఇండియా

Anushka Shetty - పాన్ ఇండియా

మరి అది   ఎంత వరకు ఈ చిత్రానికి కలిసొస్తుందో వేచి చూడాలి.

  • చిరంజీవికి ఒకప్పుడున్న ఇమేజ్ వేరు, కొత్త తరం నటులోచ్చాక వున్న ఇమేజ్ వేరు, పైగా భారత దేశం అంతటా సినిమా  రిలీజ్ అంటున్నారు కాబట్టి అయన డ్యూయెట్లకి, ఫైట్లకి భారతదేశం సలాంకొడుతుందా? లేక సాహూ లాగా తుస్సుమంటుందా వేచి చూడాలి. 
  • సంగీత దర్శకుడు కూడా మనవాడు కాదు, హిందీ అతన్నీ (అమిత్ త్రివేది) పెట్టుకున్నారు, ఇక సినిమా కంటెంట్ విషయానికొస్తే కథ మీద కూడా చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
  • అసలు ఉయ్యాలవడ నరసింహా రెడ్డి స్వతంత్ర సమరయోధుడే కాదని జస్ట్ ఒక ఊరి పెద్ద అని కొందరు...,మీ కులపిచ్చి తొ ఎందుకు అబద్దపు చరిత్రని  జనాల ఫై రుద్దుతారని మరి కొందరు..., 18 వ శతాబ్దపు నర్సింహా రెడ్డి ఫస్ట్ రెబెల్లిన్ ఎలా అవుతాడు? అంతకు ముందే 17 వ శతాబ్దపు  తమిళ నాడు నుండి పులి తేవర్ వున్నాడు కదా అని కొందరు,  కేరళ వర్మ పజస్సి రాజా అందరికంటే ముందు వాడు అని మరికొందరు, ఒరిస్సా నుండి జగన్నాథ గజపతి నారాయణ దెవొ 17 శతాబ్దంలోనే బ్రిటిష్ వారిపైన తిరగబడ్డాడని ఇటీవల ప్రముఖ బీజేపీ నేత ప్రకాష్ జవదేకర్ చెప్పకనే చెప్తున్నారు. 
  • మరోవైపు మా పర్మిషన్ తీసుకోకుండా అసలు సినిమా ఎలా తీస్తారని కుటుంబ సభ్యుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
  • కంటెంట్ ఫై ఇన్ని లొసుగుల్లన్న ఈ చిత్రo  ప్రేక్షకుణ్ణి రంజింప చేస్తుందా లేదా అని సినిమా తీసిన సురేందర్ రెడ్డే చెప్పాలి లేదా ప్రజలు చెప్తారు!