Jyotiraditya Scindia (Photo Credits: ANI) ..

Hyderabad, September 3: వరంగల్ నగరంలో RCS-UDAN పథకం కింద విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించి కార్యాచరణను సిద్ధంచేయడానికి మార్గాలు అన్వేషించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి M జ్యోతిరాదిత్య సింధియా తెలంగాణ ప్రభుత్వాన్ని మరియు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ లిమిటెడ్ (HIAL) లను కోరారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు రాసిన లేఖలో ఆయన స్పందిస్తూ వరంగల్ విమానాశ్రయం HIAL కి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ, పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కారంతో దీనిని అభివృద్ధి చేయవచ్చని కేంద్ర మంత్రి చెప్పారు. HIAL మరియు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) తో సంప్రదించి రాష్ట్ర ప్రభుత్వం ఈ అవకాశాన్ని పరిశీలించాలని యూనియన్ మంత్రి సూచించారు.

అలాగే హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (హెచ్ఐఏఎల్) కోసం రాయితీ ఒప్పందం గడువు పొడిగింపు గురించి సింధియా తన లేఖలో ప్రస్తావించారు. రాయితీ ఒప్పంద వ్యవధి పొడిగింపు కొరకు HIAL యొక్క అభ్యర్థనను పున:పరిశీలించాలని మరియు దాని సిఫార్సులను పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి, నిర్మాణం మరియు నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం మరియు హెచ్ఐఏఎల్ మధ్య డిసెంబర్ 20, 2004 నాటి రాయితీ ఒప్పందం (సిఏ) ఉందని ఆయన పేర్కొన్నారు.

హెచ్ఐఏఎల్ తన రాయితీ వ్యవధిని మొదట అనుకున్న 30 సంవత్సరాలకు మించి, మరో 30 సంవత్సరాలు పొడిగించాలని అభ్యర్థించింది. అంటే ప్రస్తుతం ఉన్న గడువు మార్చి 23, 2038 ముగుస్తుంది, దీనిని మార్చి 23, 2068 పొడగించాలని కోరుతోంది. ఇందుకు సంబంధించి సిఫార్సులను పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్నిలేఖలో సింధియా కోరారు.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం మొత్తానికి ఒకేఒక విమానాశ్రయం హైదరాబాద్ నగరంలో ఉంది. రాష్ట్రంలో విమానయాన సేవలు మరికొన్ని నగరాలకు విస్తరించాలని కోరింది. న వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం లలో నూతన విమానాశ్రయాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. అయితే కేంద్ర మంత్రి సింధియా కేవలం వరంగల్ నగరంలో విమానాశ్రం అభివృద్ధి గురించే ప్రస్తావించటం గమనార్హం.