TSPSC Group 1 2023: పరీక్షకు 15 నిమిషాల ముందే గేట్లు బంద్, గ్రూప్ 1 అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ కీలక సూచనలు, గుర్తింపు కార్డు తప్పనిసరి

తెలంగాణ రాష్ట్రంలో 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఈ నెల 11న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. తాజాగా ఈ పరీక్షకు హాజరు కాబోయే అభ్యర్థులకు కమిషన్ పలు కీలక సూచనలు చేసింది. పరీక్షా కేంద్రాల వద్దకు సమయానికన్నా ముందే చేరుకోవాలని పేర్కొంది.

TSPSC Group 1 2023: పరీక్షకు 15 నిమిషాల ముందే గేట్లు బంద్, గ్రూప్ 1 అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ కీలక సూచనలు, గుర్తింపు కార్డు తప్పనిసరి
TSPSC (Photo-Wikimedia Commons)

తెలంగాణ రాష్ట్రంలో 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఈ నెల 11న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. తాజాగా ఈ పరీక్షకు హాజరు కాబోయే అభ్యర్థులకు కమిషన్ పలు కీలక సూచనలు చేసింది. పరీక్షా కేంద్రాల వద్దకు సమయానికన్నా ముందే చేరుకోవాలని పేర్కొంది. పరీక్షకు పదిహేను నిమిషాల ముందే గేట్లు బంద్ చేస్తామని, ఆ తర్వాత వచ్చిన వారిని లోపలికి అనుమతించబోమని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

దేశంలో ఉత్తమ విద్యాసంస్థగా ఐఐటి మద్రాస్, ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్ విడుదల చేసిన కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ

ఓఎంఆర్ షీట్ లో వివరాలను జాగ్రత్తగా నింపాలని కమిషన్ సూచించింది. ఆ సమయంలో దొర్లే పొరపాట్లకు అభ్యర్థులదే బాధ్యత అని, మరో ఓఎంఆర్ షీట్ ఇవ్వలేమని తేల్చిచెప్పింది. బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తో మాత్రమే ఓఎంఆర్ షీట్ నింపాలని, బబ్లింగ్ సరిగ్గా చేయాలని సూచించింది. బబ్లింగ్ సరిగ్గా లేకున్నా, పెన్సిల్, ఇంక్ పెన్, జెల్ పెన్ తో బబ్లింగ్ చేసినా.. సదరు ఓఎంఆర్ షీట్లు చెల్లుబాటు కావని తేల్చిచెప్పింది.

ఉత్తమ విశ్వవిద్యాలయంగా IISC, దేశంలో టాప్ టెన్ ఉత్తమ విశ్వవిద్యాలయాలను విడుదల చేసిన కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్ ఇదిగో..

పరీక్షా కేంద్రానికి వచ్చేటపుడు హాల్ టికెట్, ఆధార్, పాన్ కార్డులతో పాటు ప్రభుత్వ ఉద్యోగి అయితే సంబంధిత గుర్తింపు కార్డు, డ్రైవింగ్‌ లైసెన్సు తదితర ఫొటోతో కూడిన ప్రభుత్వ గుర్తింపుకార్డులు వెంట తీసుకొని రావాలని స్పష్టం చేసింది. పరీక్షలో అక్రమాలకు పాల్పడితే కేసులు నమోదు చేసి, కమిషన్‌ నిర్వహించే పరీక్షలు రాయకుండా డిబార్‌ చేస్తామని హెచ్చరించింది.

(The above story first appeared on LatestLY on Jun 05, 2023 03:42 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).