Horoscope Today 4 June 2022: శనివారం ఈ రాశుల వారికి చాలా లక్కీ, ధన లక్ష్మీదేవి తలుపు తడుతుంది, ఈ రాశుల వారు స్నేహితుల చేతిలో మోసపోయే చాన్స్, మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి...
(Photo Credits: Flickr)

శనివారం చాలా మందికి గుడ్‌న్యూస్ అందించనుంది. మరి కొంతమందికి అప్రమత్తం చేయనుంది సింహరాశివారు ఉన్నత స్థానాన్ని పొందేందుకు టీమ్ లేదా బాస్‌తో సత్సంబంధాలు కలిగి ఉండాలి. అటు ధనస్సురాశివారికి అధికారిక స్థితి బాగుంటుంది.

మేషం

బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆరోగ్య విషయాలలో శ్రద్ధ వహించాలి. వ్యాపారపరంగా తీసుకున్న నిర్ణయాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. ఇంటాబయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి దూరప్రయాణ సూచనలున్నాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

వృషభం

కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. పాత మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. నూతన వస్తు వస్త్ర లాభాలు పొందుతారు వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.

మిధునం

చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. వృత్తి వ్యాపారాలలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా వేస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలొ ఊహించని స్థానచలన సూచనలు ఉన్నవి.

కర్కాటకం

గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి.ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలలో అంచనాలు అందుకుంటారు ఉద్యోగార్థులకు నూతన ఆశలు చిగురిస్తాయి విద్యార్థుల ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.

సింహం

ప్రయాణాలు వాయిదా వెయ్యటం మంచిది. ఒక ముఖ్య వ్యవహారంలో ఆప్తుల నుండి కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన పనులలో ఆలోచన నిలకడ లోపిస్తుంది. వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన పురోగతి ఉండదు. బంధువులతో విభేదాలు కలుగుతాయి. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి.

కన్య

గృహ నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతాయి వివాదాలకు సంబంధించి ఆప్తులు సలహాలు తీసుకోవడం మంచిది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. సమాజంలో విశేష గౌరవ మర్యాదలు పొందుతారు. పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

తుల

నూతన వ్యవహారాలలో కార్యసిద్ధి కలుగుతుంది. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. వ్యాపార వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

వృశ్చికం

దాయాదులతో స్ధిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత నిరాశ పరుస్తుంది. చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమౌతాయి. బంధు మిత్రులతో కీలక విషయాలు చర్చిస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగమున ఒత్తిడి పెరుగుతుంది.

What Is Elinati Shani Effect: ఏలినాటి శని అంటే ఏంటో తెలుసా, శని ప్రభావం నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి, ఈ తప్పు చేస్తే ఏడున్నరేళ్లు శని వదలకుండా పట్టి పీడిస్తుంది..

ధనస్సు

నూతన రుణాలు చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆర్ధిక ఒత్తిడులు పెరుగుతాయి దైవచింతన కలుగుతుంది. నూతన వ్యాపారాలు కాస్త అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులనుండి విమర్శలు పెరుగుతాయి. ఇతరులతో ఇబ్బందులు తప్పవు.

మకరం

గృహమున శుభకార్యాల రీత్యా ఖర్చులు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో వివాదాలు రాజీ చేసుకుంటారు. నూతన వస్తులాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలు అందుకుంటారు.

కుంభం

ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి చాలాకాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కారానికి మార్గాలు దొరుకుతాయి. అవసరానికి తగిన ఆదాయం అందుతుంది. సోదరులతో స్ధిరాస్తి వివాదాలకు నూతన ఒప్పందాలు చేసుకుంటారు వ్యాపారాలు సజావుగా సాగుతాయి నిరుద్యోగులకు అధికారుల ఆదరణ పొందుతారు.

మీనం

చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు పెరుగుతాయి. బంధు మిత్రులతో కొన్ని వ్యవహారాలలో విభేదాలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. అనారోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి.