How Indian Cinema Treats Transgenders? ట్రాన్స్ జెండర్స్ ని మన మీడియా మరియు సినిమా ఎలా చూపిస్తోంది?

లింగం, లైంగికత మరియు భారతీయ మీడియాపై రాష్ట్ర స్థాయి సమావేశం సెప్టెంబర్ 5,6 తేదీల్లో మదురైలోని అమెరికన్ కాలేజీలో జరిగింది.

ఈ అంశాన్ని, అందులోని వ్యక్తులు (ట్రాన్స్ జె oడెర్స్)ఎదుర్కొంటున్న సమస్యలను ఎత్తి చూపడానికి కళాశాల సామాజిక కార్య విభాగం మరియు మదురైలోని ట్రాన్స్‌జెండర్ రిసోర్స్ సెంటర్ సంయుక్తంగా ఈ కార్య క్రమాన్ని నిర్వహించింది.

రెండు రోజుల ఈ కార్యక్రమంలో చాలా మంది విద్యార్థులు, విద్యావేత్తలు మరియు పాత్రికేయులు పాల్గొన్నారు. అందులో చర్చించిన విషయాలు క్లుప్తంగా మీకోసం.

  • ముందుగా “LGBTQI కి చెందిన వారు ఎక్కువ లైంగిక భావాలను కలిగి ఉంటారు అనే ఆలోచన తప్పని, వారు కలిసిన ప్రతి ఒక్కరితోనూ ప్రేమలో పడతారనుకోవడం తప్పని అసిస్టెంట్ ప్రొఫెసర్ మహాలక్ష్మి రాఘవన్ సూచించారు.
  •  “భారతీయ మీడియాలో ఎల్జిబిటిక్యూ  కమ్యూనిటీపై స్టీరియోటైప్స్” ఆపాలని మరికొందరు పేర్కొన్నారు.

 • వార్తలు మరియు మీడియా సెషన్‌లో ట్రాన్స్ జెండర్స్ గురించి వివరంగా చర్చించాల్సి ఉండగా, ట్రాన్స్ కమ్యూనిటీ పై వార్తా సంస్థలు చేస్తున్న రిపోర్టింగ్, ఉపయోగించే పదజాలం  చాలా బాధాకరమని వారు వాపోయారు.
 • ట్రాన్స్ జెండర్స్ ఆత్మహత్యలను నివేదించేటప్పుడు, తల్లిదండ్రులు తమ పిల్లలను అర్థం చేసుకోకపోవడం పై  విశ్లేషించడంలో వైఫల్యం చందుతున్నారని అందులో కొందరు అభిప్రాయపడ్డారు.

 • ట్రాన్సజెండర్స్  కూడా మనుషులేనని వారికి కూడా గౌర మర్యాదలు అతయంత ముఖ్యమని. మీడియాలో వారిని సంబోధించే టప్పుడు, వాడే  పదజాలం ఫై చాలా జాగ్రత్త వహించాలని మరి  కొందరు సూచించారు.
 • ‘సినిమా దర్శకులు ట్రాన్సజెండ ర్స్ కు క్షమాపణ చెప్పాలిని’ సమాజంలో వారిని అగౌరవపరిచే విధంగా తమ ఫై  డైలాగులు, సన్నివేశాల చూపిస్తున్నారని “ఉదా: వడివేలు యొక్క‘వాడా...నీ యబ్బ" పంక్తిని తీసుకోండి. దాని అర్థం ఏమిటి? ఇది ఎలా ఫన్నీ? అని కొందరు నిలదీశారు.

  • “సినిమాలో చాలా కాలంగా, ట్రాన్స్ పీపుల్ చిత్రణ కామెడీ కోసమే ఉంటుందని  దర్శకులందరూ మాకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని మరి కొందరు డిమాండ్  చేశారు. .
  • తమిళ్ డైరెక్టర్ "శంకర్, అమీర్, గౌతమ్ మీనన్, తియగరాజన్ కుమారరాజా, ఆనంద్ శంకర్ వంటి దర్శకులు మాకు క్షమాపణ చెప్పాలి" వారు నిలదీశారు.
  • వార్త పత్రికల కూడా ప్రతి పండుగకు ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తోంది?’ వంటి అసంబద్ధమైన ప్రశ్నలను అడగడం మానాలని వారు  కోరారు.

 • ట్రాన్స్‌ పీపుల్స్‌ కి సినిమా, న్యూస్‌ రూమ్‌లు, పబ్లిషింగ్‌ హౌస్‌లలో భాగం కావడానికి అవకాశం ఇస్తేనే ప్రజల్లో వారికి నిజమైన న్యాయం జరుగుతుందని కొందరు అభిప్రాయ పడ్డారు.
 • పుస్తకాల నుండి సినిమా వరకు ట్రాన్స్ ప్రజలు వ్రాసిన, చేసిన కళాత్మక రచనలు ప్రజల దృక్పథాలను మార్చడంలో ఎంతగానో మార్పు తీసుకొస్తాయని మరికొందరు సూచించారు.