Chennai, August 30: సినిమాల  పైరసీ (Piracy)కి పాల్పడుతున్న వెబ్‌సైట్లపై మద్రాస్ హైకోర్టు (Madras High court)కొరడా ఝుళిపించింది. 1788 పైరసీ వెబ్‌ సైట్లపై నిషేధం విధించింది. వివరాలకు వెళ్తే నటుడు విక్రమ్‌ (Vikram) కథానాయకుడుగా నటించిన కోబ్రా చిత్రం వినాయక చవితి (Vinayaka Chavithi) సందర్భంగా సందర్భంగా బుధవారం విడుదల కానుంది. కాగా పైరసీ అరాచకం రాజ్యమేలుతున్న పరిస్థితిలో కోబ్రా చిత్ర నిర్మాత తన చిత్రం పైరసీని వ్యతిరేకిస్తూ 1788 వెబ్‌ సైట్లపై నిషేధం (Ban) విధించాలని కోరుతూ ప్రభుత్వం, సామాజిక మాధ్యమం సేవా సంస్థల తరఫున హైకోర్టులో దాఖలు చేశారు.

బాలకృష్ణకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు, గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా టికెట్ రేట్లు తగ్గించలేదని పిటిషన్

కోబ్రా చిత్రం పైరసీకి గురి కాకుండా వెబ్‌ సైట్లపై నిషేధం విధించాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి కోబ్రా చిత్రాన్ని చట్ట విరుద్ధంగా వెబ్‌సైట్లలో విడుదల చేయడంపై నిషేధం విధిస్తున్నట్లు పేర్కొన్నారు.