శివునికి అభిషేకం చేయడం వల్ల కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది. రుద్రాభిషేకం చేసే వస్తువులను బట్టి ఫలితాలు లభిస్తాయి. యజుర్వేదంలో పేర్కొన్న పద్ధతి ప్రకారం రుద్రాభిషేకం చేయడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. జ్యోతిష్య పండితుల ప్రకారం. రుద్రాభిషేకం అంటే రుద్రుని అభిషేకం అంటే రుద్ర మంత్రాలతో శివలింగాన్ని అభిషేకించడం అని అర్థం. శివలింగానికి ఏ ద్రవంతో అభిషేకం చేస్తే ఏ ఫలితం లభిస్తుందో తెలుసుకుందాం.
ద్రవ్యాలు – కలిగే ఫలితాలు
భస్మ జలం.. మహా పాప హరణం
సుగంధోదకం … పుత్ర లాభం
పుష్పోదకం… భూలాభం
బిల్వ జలం … భోగ భాగ్యాలు
ఆవు పాలతో….. సర్వ సౌఖ్యాలు
ఆవు పెరుగు… ఆరోగ్యం, బలం
ఆవు నెయ్యి…. ఐశ్వర్యాభివృద్ధి
చెరకు రసం … దుఃఖ నాశనం, ఆకర్షణ
తేనె .. తేజో వృద్ధి
నువ్వుల నూనె… అపమృత్యు హరణం
రుద్రాక్షోదకం … మహా ఐశ్వర్యం
సువర్ణ జలం … దరిద్ర నాశనం
అన్నాభిషేకం .. సుఖ జీవనం
గంగోదకం … సర్వ సమృద్ధి, సంపదల ప్రాప్తి
కస్తూరీ జలం .. చక్రవర్తిత్వం
నేరేడు పండ్ల రసం .. వైరాగ్య ప్రాప్తి
నవరత్న జలం… ధాన్య గృహ ప్రాప్తి
ద్రాక్ష రసం …. సకల కార్యాభివృద్ధి
నారికేళ జలం … సర్వ సంపద వృద్ధి
ఖర్జూర రసం …. శత్రు నాశనం
దూర్వోదకం… ద్రవ్య ప్రాప్తి
ధవళోదకమ్ … శివ సాన్నిధ్యం
మామిడి పండు రసం… దీర్ఘ వ్యాధి నాశనం
పసుపు, కుంకుమ… మంగళ ప్రదం
విభూది …. కోటి రెట్ల ఫలితం లభిస్తుంది.
Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం గ్యాస్ స్టవ్ ఏ దిక్కున ఉంటే మంచిది ...