File image of 2002 Gujarat Riots (Photo Credits: PTI)

Ahmedabad Sep 6: 2002 నాటి గోద్రా అల్లర్ల కేసులో అప్పటి గుజరాత్ సీఎంగా ఉన్న నేటి ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) నుంచి తమకు నష్టపరిహారం కల్పించాలంటూ గుజరాత్‌లోని సబర్కంతా దిగువ న్యాయస్థానంలో దాఖలైన పిటిషన్‌ను‌ కోర్టు తోసిపుచ్చింది. గోద్రా అల్లర్లలో (Gujarat 2002 Riots) నాటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ ప్రమేయం ఉందనడానికి ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని కోర్టు తెలిపింది. అందువలన వ్యాజ్యం నుంచి మోదీ పేరును తొలగిస్తున్నట్లు (Court drops Modi's name) స్పష్టం చేసింది.

200లో గుజరాత్ అల్లర్ల సమయంలో (2002 post-Godhra riots) ప్రత్యర్థి దాడిలో హత్యకు గురైన ముగ్గురు ముస్లిం వ్యక్తుల తరఫున బ్రిటన్‌కు చెందిన ఓ కుటుంబం స్థానిక కోర్టులో 2004లో వ్యాజ్యం దాఖలు చేసింది. తమ కుటుంబ సభ్యుల మృతికి నాటి సీఎం నరేంద్ర మోదీనే కారణమని, ఆయన నుంచి 24 కోట్ల రూపాయలు నష్ట పరిహారం కల్పించాలని ఈ పిటిషన్‌లో వారు డిమాండ్‌ చేశారు. దీనిపై సుదీర్ఘ విచారణ చేపట్టిన దిగువ కోర్టు.. నాటి అల్లర్లకు మోదీనే కారణమని చెప్పడానికి ఆధారాలు లేవని పిటిషన్‌ నుంచి ఆయన పేరును తొలగిస్తున్నట్లు ఆదివారం తీర్పును వెలువరించింది.

14 మంది దోషులకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు, స్వరాష్ట్రంలోకి అనుమతి నిషేధం, అధ్యాత్మిక మరియు సమాజ సేవల్లో భాగం అవ్వాలని దోషులకు సుప్రీం ఆదేశం

కాగా 2002 నాటి గోద్రా అల్లర్ల కేసులో కేంద్ర ప్రభుత్వ నియమించిన నానావతి కమిషన్ మోదీకి క్లీన్‌ చిట్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ 2014 ఎన్నికల వరకు గుజరాత్‌ సీఎంగా పని చేశారు. ఆయన హయాంలో జరిగిన గోద్రా అల్లర్ల ఘటన తర్వాత.. చెలరేగిన హింసాత్మక ఘటనల్లో వెయ్యి మందికిపైగా చనిపోయారు. వీరిలో ఎక్కువ మంది మైనార్టీలే. ఇందులో మోదీ ప్రమేయం ఉందడానికి ఎలాంటి ఆధారాలు లేవని.. అల్లరి మూకలను నియంత్రించడంలో పోలీసుల వైఫల్యమే కారణమని నానావతి కమిషన్ నివేదికలో తెలిపింది.

సబర్మతి ఎక్స్‌ప్రెస్ బోగీల దహనం పక్కా ప్రణాళికతో చేసిందేనని.. తర్వాత జరిగిన అల్లర్లు మాత్రం ప్రణాళికా బద్ధంగా జరిగినవి కావని నానావతి కమిషన్ తెలిపింది. ఈ అల్లర్ల వెనుక రాష్ట్రానికి చెందిన ఏ ఒక్క మంత్రి ప్రమేయం ఉందనడానికి లేదా.. వారి ప్రోద్బలంతోనే దాడులు జరిగాయనడానికి ఆధారాలు లేవని కమిషన్ తన నివేదికలో వెల్లడించింది. 1500 పేజీలతో తొమ్మిది సంచికలుగా ఈ నివేదికను రూపొందించింది.

గుజరాత్ అల్లర్ల కేసు విచారణకు గుజరాత్ హైకోర్ట్ రిటైర్డ్ జడ్జి కేజీ షాతో 2002 మార్చి 6న నాటి సీఎం మోదీ కమిషన్ ఏర్పాటు చేశారు. కానీ ఆయనతో మోదీకి ఉన్న సాన్నిహిత్యం కారణంగా మానవ హక్కుల సంఘాలు నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. దీంతో సుప్రీం రిటైర్డ్ జస్టిస్ జీటీ నానావతి పేరును కూడా కమిషన్‌లో చేర్చారు. మధ్యంతర నివేదిక సమర్పించడానికి ముందే షా చనిపోవడంతో.. గుజరాత్ హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ అక్షయ్ మెహతాను ఈ కమిషన్‌లో సభ్యుడిగా చేర్చారు. 2008 సెప్టెంబర్‌లో నివేదిక తొలి భాగాన్ని ప్రభుత్వానికి సమర్పించిన కమిషన్.. 2014 నవంబర్ 18నన నాటి గుజరాత్ సీఎం ఆనందీబెన్ పటేల్‌కు మరో నివేదికను సమర్పించింది.