ప్రతి సంవత్సరం దసరా ఆశ్వీయుజ మాసం దశమి రోజున జరుపుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే దసరా పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ఈ శుభ సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో బహిరంగ మైదానంలో రావణ దహనం నిర్వహిస్తారు. శ్రీరాముడి చేతిలో లంకా రాజు రావణుడి వధ దసరా రోజు సంభవించినట్లు ప్రస్తావించారు. ఈ రోజున శ్రీరాముడు రావణుడిని సంహరించాడు. ఈ సందర్భంగా అయోధ్యలో విజయదశమి వేడుకలు ఘనంగా జరిగాయి. అప్పటి నుండి, దసరా ప్రతి సంవత్సరం ఆశ్వీయు మాసం పదవ రోజున జరుపుకుంటారు. ఈ రోజున శ్రీరాముని పూజిస్తారు. ఈ సందర్భంగా మీ బంధు మిత్రులకు శుభాకాంక్షలు తెలియ జేయాలంటే ఈ గ్రీటింగ్స్ మీ కోసం.

దసరా పండగ రోజున అందరూ ఆనందంగా గడపాలని , చేసే ప్రతికార్యం ఆ దుర్గామాత ఆశీస్సులతో , విజయం కావాలని మనసారా కోరుకుంటూ.. విజయదశమి శుభాకాంక్షలు

శుభప్రదమైన విజయదశమి రోజున మీ అందరికీ సుఖశాంతులు,ఐశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ..విజయదశమి శుభాకాంక్షలు

మీకు.. మీ కుటుంబ సభ్యులకు.. విజయదశమి పండుగ శుభాకాంక్షలు

“విజయదశమి శుభాకాంక్షలు”చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే దసరా పండుగను సోదర భావంతో, భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ పర్వదినం సత్యానికి, ధర్మానికి నిలువెత్తు చిహ్నం. ప్రజలందరికీ సంతోషం, శాంతి, ఆరోగ్యం కలగాలని కోరుకుంటున్నాను.

శుభప్రదమైన విజయ దశమి రోజున మీ అందరికి సుఖసంతోషాలు,ఐశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు..!!