Ram Charan (Photo-ANI)

Chennai, April 13: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గౌరవ డాక్టరేట్ (Ram Charan) అందుకున్నాడు. చెర్రీకి చెన్నైలోని వేల్స్‌ యూనివర్సిటీ (Vels University) గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది. ఇవాళ యూనివర్సిటీలో జరిగిన స్నాతకోత్సవంలో రామ్‌ చరణ్‌ ముఖ్య అతిథిగా హాజరై అలాగే మిగతా పరిశోధక విద్యార్థులతో కలిసి డాక్టరేట్ అందుకున్నాడు. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) అధ్యక్షుడు డీజీ సీతారాం చేతుల మీదుగా చెర్రీ డాక్టరేట్ అందుకున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కళారంగంలో చరణ్ చేసిన సేవలకు ఈ డాక్టరేట్ ప్రదానం చేశారు. చెర్రీకి పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

 

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిరుత సినిమాతో హీరోగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన చెర్రీ ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. ఆయనను చిరుత, మగధీర, రచ్చ, నాయక్, ఎవడు, రంగ స్థలం, ఆర్ఆర్ఆర్ వంటి సూపర్ హిట్ సినిమాలు అగ్ర హీరోల్లో ఒకరిగా నిలబెట్టాయి. ప్రస్తుతం చెర్రీ శంకర్ దర్శకత్వంలో వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నాడు. అలాగే, దర్శకులు బుచ్చిబాబు, సుకుమార్‌తో మరో రెండు సినిమాల్లో నటించడానికి ఒప్పుకున్నాడు.