Republic Day Wishes In Telugu:  1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును గుర్తుచేసుకునేందుకు ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజు భారతదేశం దాని స్వంత నియమాలు చట్టాల ద్వారా మార్గనిర్దేశం చేయబడిన సార్వభౌమ, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా రూపాంతరం చెందడాన్ని సూచిస్తుంది. పౌరులకు సమానత్వం, న్యాయం, స్వేచ్ఛను నిర్ధారించే భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కీలక పాత్ర పోషించారు. స్వాతంత్రాన్ని పొందేందుకు బలమైన దేశాన్ని రూపొందించడానికి అవిశ్రాంతంగా కృషి చేసిన మన స్వాతంత్ర సమరయోధులు చేసిన త్యాగాలను కూడా గణతంత్ర దినోత్సవం గుర్తు చేస్తుంది. ప్రధాన వేడుక న్యూఢిల్లీలో జరుగుతుంది, రాజ్‌పథ్‌లో భారతదేశ సైనిక బలం, సాంస్కృతిక వారసత్వం వైవిధ్యంలో ఏకత్వాన్ని ప్రదర్శించే గ్రాండ్ కవాతు నిర్వహిస్తారు. అలాగే దేశవ్యాప్తంగా, పాఠశాలలు, కళాశాలలు కార్యాలయాలు జాతీయ జెండాను ఎగురవేసి, దేశభక్తి గీతాలను పాడుతూ ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాయి. ఈ సందర్భంగా మీ బంధు మిత్రులకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు ఫోటో గ్రీటింగ్స్ మీ కోసం..

మన దేశంలో ఎప్పటిలాగే మన భారతీయులంతా ఐకమత్యం, సౌభ్రాతృత్వం, న్యాయం అనే స్ఫూర్తితో జీవితాంతం ఉండాలి. దేశ ప్రజలందరికి 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

సర్వసత్తాక రాజ్యమైన భారత్.. అచిరకాలంలోనే శక్తి సంపన్నమైన, సుసంపన్నమైన దేశంగా అవతరించాల్సిన లక్ష్యం మన ముందు ఉంది. ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యసాధన కోసం మనమందరం పునరింకితమవుదామని 76వ గణతంత్ర దినోత్సవం నాడు ప్రతిన పూనుదాం.

ప్రతి హృదయంలో స్వాతంత్య్ర స్ఫూర్తి ప్రతిధ్వనించనివ్వండి మరియు మన దేశం మరింత ఉన్నత శిఖరాలకు ఎగబాకాలని కోరుకుందాం. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

కుల,మత,లింగ, వర్గ వివక్ష లేకుండా దేశ ప్రజలందరికీ ప్రాథమిక హక్కులను కల్పిస్తూ, ప్రతీపౌరుడు దేశాభివృద్ధికి పాటుపడాలనే లక్ష్యంతో డాక్టర్ B.R అంబేద్కర్ గారు రూపొందించిన "భారత రాజ్యాంగం" అమలులోకి వచ్చిన సుదినం గణతంత్ర దినోత్సవం. ”దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

సమరయోధుల పోరాట బలం... అమర వీరుల త్యాగఫలం బ్రిటిష్ పాలకులపై తిరుగులేని విజయం.. సామ్రాజ్యవాదుల సంకెళ్లు తెంచుకుని భరతజాతి సంపూర్ణ స్వేచ్ఛను పొందిన దినం’.. మన గణతంత్ర దినోత్సవం..అందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

మన దేశం స్వాతంత్రం కోసం ప్రాణత్యాగం చేసిన లక్షలాది వీరులకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, వారి త్యాగాలను స్మరించుకుంటూ జెండా వందనం చేద్దాం. బాధ్యతాయుతమైన పౌరులుగా మనదేశ ఖ్యాతిని మరింత పెంచుదాం. జై హింద్..అందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.