Supreme Court of India | (Photo Credits: IANS)

New Delhi, May 16: ఉత్తరప్రదేశ్‌ వారణాసి ‘జ్ఞానవాపి మసీద్‌ కాంప్లెక్స్‌’ ప్రాంగణంలో శివలింగం బయటపడిందన్న విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. శివలింగం బయటపడిన చోటని ప్రచారం జరుగుతున్న కొలను(బావి) ప్రాంతాన్ని సీల్‌ చేయాలని వారణాసి సివిల్‌ కోర్టు అధికారులను, పారామిలిటరీ దళాలను సోమవారం మద్యాహ్నం ఆదేశించింది. జ్ఞానవాపి కాంప్లెక్స్‌లో మసీదులో (Gyanvapi Mosque) పూర్వం శివాలయం ఉండేదని, పాత టెంపుల్‌ కాంప్లెక్స్‌ను గోడను ఆనుకుని ఉన్న దైవ ప్రతిమలకు నిత్యం పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఐదుగురు మహిళలు వారణాసి కోర్టును (Allahabad High Court ) ఆశ్రయించారు.

దీంతో ఒక ప్రత్యేక కమిషనర్‌, న్యాయవాదుల బృందాన్ని వీడియోగ్రఫీ ద్వారా సర్వే చేపట్టాలని వారణాసి కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో విచారణ కమిటీని.. జ్ఞానవాపి మసీదు నిర్వాహక కమిటీ లోనికి రానివ్వలేదు. దీంతో మళ్లీ కోర్టు జోక్యంతో శనివారం నుంచి సోమవారం.. మొత్తం మూడు రోజుల పాటు విచారణ జరిగింది. కఠిన ఆంక్షలు, నిర్భందం మధ్య మొత్తానికి కమిటీ మొత్తానికి సోమవారంతో సర్వే పూర్తి చేసింది. ఈ తరుణంలో కొలను(బావి) నుంచి శివలింగం బయటపడిందన్న ప్రకటనతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు హిందూ మహిళలు భారీ ఎత్తున్న ఇక్కడికి చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇళ్లు కట్టిస్తామని చెప్పిన బీజేపీ ఇప్పుడు బుల్డోజ‌ర్ల‌తో కూల్చేస్తోంది, 63 ల‌క్ష‌ల మందిని రోడ్డు మీదకు తీసుకువస్తోందని మండిపడిన సీఎం అరవింద్ కేజ్రీవాల్

ఇంకోవైపు మసీద్‌ కమిటీ అక్కడే ఉండడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ క్రమంలో జోక్యం చేసుకున్న న్యాయస్థానం ఆ ప్రాంతాన్ని సీల్‌ చేసి.. ఎవరినీ అనుమతించకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది. శివలింగం బయటపడిందన్న వార్తను వారణాసి జిల్లా న్యాయమూర్తి కౌశల్‌ రాజ్‌ శర్మ ధృవీకరించలేదు. కేవలం పిటిషన్‌దారులు మాత్రమే శివలింగం బయటపడిందంటూ చెప్తున్నారు.

వాస్తవానికి మే 6వ తేదీనే జ్ఞానవాపి మసీద్‌ కాంప్లెక్స్‌లో వీడియో విచారణ జరగాల్సి ఉన్నప్పటికీ.. మసీద్‌ కమిటీ వాగ్వాదంతో అది జరగలేదు. పైగా మసీదులో వీడియోలు తీయకూడదంటూ పేర్కొంది. దీనిపై దిగువ న్యాయస్థానం, అలహాబాద్‌ హైకోర్టు.. చివరకు సుప్రీం కోర్టుకు (Supreme Court) పంచాయితీ చేరింది. వీడియో చిత్రీకరణను అడ్డుకోవడాన్ని సుప్రీం తిరస్కరించగా.. మసీద్‌ కాంప్లెక్స్‌లో సర్వే అంశంపై అభ్యర్థన పిటిషన్‌ను మాత్రం పరిశీలిస్తామని పేర్కొంది. అంజుమన్ ఇంతేజామియా మసాజిద్ కమిటీ వేసిన పిటిషన్‌ను జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం మే 17న విచారించనుంది. మరోవైపు మూడు రోజుల విచారణ కమిటీ అందించే నివేదికను మే 17వ తేదీనే వారణాసి కోర్టు పరిశీలించనుంది.