Mumbai, SEP 27: పెట్టుబడులు పెడుతున్నారా? సేవింగ్స్ ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నారా? వచ్చే నెల నుంచి ఆర్థిక విషయాలకు సంబంధించి నిబంధనలు మారనున్నాయి. అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త ఫైనాన్షియల్ రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఇందులో ముఖ్యంగా ఐసీఐసీఐ డెబిట్ (ICICI Debit Cards), క్రెడిట్ కార్డుల ఛార్జీలు, సేవింగ్స్ అకౌంట్ల ఛార్జీలు, పంజాబ్ నేషనల్ బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ ఛార్జీలు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై కొత్త నిబంధనలు వర్తించనున్నాయి. అదేవిధంగా టీడీఎస్ రేట్లకు సవరణలతో సహా ఈ కొత్త మార్పులు అమలులోకి వస్తాయి. తద్వారా మీ ఆర్థిక, పెట్టుబడులపై ప్రభావం పడవచ్చు. స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్‌లో కూడా మార్పులు ఉండనున్నాయి. అవేంటో వివరంగా తెలుసుకుందాం.
స్మాల్ సేవింగ్ స్కీమ్స్ రూల్స్ :
పోస్టాఫీస్ స్కీమ్‌ల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి యోజనలో వచ్చే నెల 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. జాతీయ స్మాల్ సేవింగ్స్ పథకాల కింద గతంలో ఓపెన్ చేసిన అకౌంట్లపై ప్రభావం ఉంటుంది. ఒకటికి మించి అకౌంట్లు తెరిచినా లేదా పిల్లలు, తాతలు లేదా గార్డియన్ల పేరిట తెరిచిన అకౌంట్లను వెంటనే క్రమబద్ధీకరించాలి.
ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్ కార్డ్ ఛార్జీలు :
ఐసీఐసీఐ బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం.. “అక్టోబర్ 01, 2024 నుంచి రూ.10వేల ఖర్చుతో రెండు కాంప్లిమెంటరీ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్‌ను పొందవచ్చు. గత క్యాలెండర్ త్రైమాసికంలో చేసిన ఖర్చులు తదుపరి క్యాలెండర్ త్రైమాసికానికి యాక్సెస్‌ను అన్‌లాక్ అవుతాయి. అక్టోబర్-నవంబర్-డిసెంబర్, 2024 త్రైమాసికంలో కాంప్లిమెంటరీ లాంజ్ యాక్సెస్‌కు అర్హత పొందడానికి మీరు కనీసం రూ. 10వేలు జూలై-ఆగస్ట్-సెప్టెంబర్ 2024 త్రైమాసికంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదే విధంగా తదుపరి త్రైమాసికాల్లో కూడా ఇదే విధానాన్ని పాటించాలి.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రూల్స్ :
స్మార్ట్‌బై (Smart buy) ప్లాట్‌ఫారమ్‌లో ప్రతి క్యాలెండర్ త్రైమాసికంలో ఒక ప్రొడక్టుకు ఆపిల్ ప్రొడక్టులకు సంబంధించిన రివార్డ్ పాయింట్‌లను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పరిమితం చేసింది. స్మార్ట్‌బై పోర్టల్ ప్రతి క్యాలెండర్ త్రైమాసికానికి 50వేల రివార్డ్ పాయింట్‌ల చొప్పున తనిష్క్ వోచర్‌ల కోసం రివార్డ్ పాయింట్‌ల రిడీమ్‌ను పరిమితం చేస్తుంది.
స్థిరాస్తి అమ్మకంపై టీడీఎస్ (TDS) :
సెక్షన్ 194-IA సవరణలు, రూ. 50 లక్షలకు మించిన స్థిరాస్తి విక్రయానికి సంబంధించిన చెల్లింపులు తప్పనిసరిగా 1శాతం టీడీఎస్ కలిగి ఉండాలి. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయి. మరోవైపు.. టీడీఎస్ రేటు 2 శాతానికి తగ్గింది. ఇ- కామర్స్ ఆపరేటర్లకు 0.1 శాతానికి తగ్గింది. సెక్షన్ 164G లాటరీ టికెట్స్ సేల్ ద్వారా వచ్చిన కమిషన్, ఇతర బ్రోకరేజీ పేమెంట్లు, హెచ్‌యూఎఫ్‌లు అద్దె చెల్లింపులపై టీడీఎస్ రేట్లు వచ్చే నెల నుంచి తగ్గనున్నాయి.
Amazon: వారానికి 5 రోజులు ఆఫీసుకు రావాల్సిందే, ఉద్యోగులకు హుకుం జారీ చేసిన అమెజాన్
పీఎన్‌బీ కొత్త ఛార్జీలు :
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) సేవింగ్స్ అకౌంట్లకు వర్తించే కొన్ని ఆన్-క్రెడిట్-సంబంధిత సర్వీసు ఛార్జీలలో మార్పులను ప్రకటించింది. ఇందులో కనీస సగటు బ్యాలెన్స్, డిమాండ్ డ్రాఫ్ట్‌లు జారీ, డీడీ డుప్లికేట్ చేయడం, చెక్కులు (ఈసీఎస్‌తో సహా), రిటర్న్ ఖర్చులు, లాకర్ అద్దె ఛార్జీలు ఉంటాయి.