No protests allowed in Kashmir till situation improves: JK DGP Dilbagh Singh (Photo-Ians)

Srinagar, october 19:  జమ్ము కాశ్మీర్‌లో పరిస్థితి మెరుగుపడే వరకూ ఎవరూ ఎలాంటి నిరసన ప్రదర్శనలు చేపట్టడానికి వీలు లేదని డిజిపి దిల్‌బాగ్‌ సింగ్‌ అన్నారు. కాశ్మీర్‌లోయలో ఆంక్షలను పూర్తిగా ఎత్తివేసి, పరిస్థితులు మెరుగుపడే వరకూ ఏ రకమైన పద్ధతుల్లోనూ ప్రదర్శనలు చేపట్టరాదని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొనేలా చూడటం తమ ప్రథమ కర్తవ్యమని ఆయన చెప్పారు. ప్రభుత్వ ఆంక్షలు ఉన్నంత వరకు నిరసన ప్రదర్శనలను నిషేధిస్తున్నామని, కశ్మీరులో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ఈ నిషేధం అమలవుతుందని ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్యూలో పేర్కొన్నారు. నిరసన కార్యక్రమాలను అనుమతించడానికి ముందు అక్కడ శాంతిని మరింత సుస్థిరం చేయడం కోసం మ్మూ కాశ్మీర్ పోలీసులంతా కృషి చేస్తున్నారన్నారు.

కాగా ఆరుగురు మహిళలు నిరసన ప్రదర్శన నిర్వహించిన విషయాన్ని దిల్‌బాగ్ సింగ్ ప్రస్తావించారు. ఈ మహిళలు పట్టుకున్న ప్లకార్డుల్లో కొన్నిటిలో రాసిన నినాదాలు సరైనవి కాదని చెప్పారు. లోయలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని, అందుకే చర్య తీసుకోవలసి వచ్చిందని చెప్పారు. రెచ్చగొట్టడం మాటల ద్వారా మాత్రమే కాదని, ప్లకార్డుల్లోని నినాదాల ద్వారా కూడా సాధ్యమవుతుందని చెప్పారు. ఇటువంటి శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తాయని తెలిపారు. శ్రీనగర్‌లో అమలవుతున్న ఆంక్షలను గౌరవించాలని కశ్మీరీలను కోరారు. మహిళా నిరసనకారులు డిప్యూటీ కమిషన్‌ వద్ద అనుమతి పొందాలని తెలిపారు. కచ్చితంగా నిరసనలను అనుమతించేది లేదన్నారు. అయితే పరిస్థితి మెరుగుపడితే ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలిస్తామని చెప్పారు.

మొబైల్స్ పై నిషేధం 

పోలీసులు అరెస్టు చేసిన వారిలో ఎన్‌సి అధ్యక్షుడు ఫరూఖ్‌ అబ్దుల్లా సోదరి సురయ్యా, కుమార్తె సఫియా, జమ్ము కాశ్మీర్‌ మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బషీర్‌ అహ్మద్‌ఖాన్‌ సతీమణి హవా బషీర్‌ తదితరులున్నారు. శ్రీనగర్‌లోని లాల్‌ చౌక్‌ సమీపంలో ఉన్న ప్రతాప్‌ పార్కు వద్ద కొంతమంది మహిళలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ మౌనంగా కూర్చున్నారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి వారిని అదుపులోకి తీసుకున్నారు. జమ్మూ-కశ్మీరుకు కల్పించిన ప్రత్యేక ప్రతిపత్తిని కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 5న రద్దు చేసింది. ఆ రాష్ట్రాన్ని జమ్మూ-కశ్మీరు, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. అనంతరం కశ్మరులో పరిస్థితిని అదుపు చేసేందుకు వివిధ రకాల చర్యలు తీసుకుంది.