Image Source : QUORA

నేటి నుంచి అంటే మే 17 అనగా మంగళవారం నుండి జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతుంది. మే 17న జ్యేష్ఠ మాసం (Jyeshta Month 2022) ఆరంభమై జూన్ 14న ముగుస్తుంది. ఉదయం నుండి శివయోగం ఏర్పడినందున ఈ రోజు చాలా పవిత్రమైనది. రాత్రి 10:38 నుండి సిద్ధయోగం ప్రారంభమవుతుంది. జ్యేష్ఠ మాసం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.

జ్యేష్ఠ మాసంలో కొన్ని పనులు చేయడం వల్ల అదృష్టం, పుణ్యం లభిస్తాయి. ఈ మాసంలో సూర్యుని ప్రకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు కొన్ని పనులు చేయడం ద్వారా సూర్య భగవానుడి అనుగ్రహాన్ని పొందవచ్చు. దీని వల్ల మీకు కీర్తి, విజయం సిద్ధించవచ్చు.

జ్యేష్ఠ మాసంలో మంగళవారాలను మహా మంగళ వారం అంటారు. 2022 జ్యేష్ఠమాసంలో మొత్తం 5 మంగళవారాలు వచ్చాయి. అందులో మొదటి మంగళవారం మే 17న ప్రారంభం అవుతోంది. ఈ రోజు హనుమంతుడి ఆరాధనకు అంకితం చేయబడింది. ఈ రోజున హనుమంతుడిని హృదయపూర్వకంగా ఆరాధించడం వల్ల మనిషికి ఉన్న అన్ని కష్టాలు తొలగిపోతాయి.

Rahul Gandhi Padayatra: కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ రాహుల్ గాంధీ పాదయాత్ర, కాంగ్రెస్ చింతన్ శివిర్ సమావేశాల్లో కీలక నిర్ణయం 

జ్యేష్ఠ మాసంలో హనుమంతుని ఆరాధన యొక్క ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది. జ్యేష్ఠ మాసంలో వచ్చే మంగళవారాన్ని మహా మంగళవారం అంటారు. ఈ రోజున బజరంగ్ బలిని పూజించడానికి ప్రత్యేకత ఉంది. ఈ రోజున వివిధ ప్రాంతాలలో ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ రోజు జలదానం చేస్తే చాలా మేలు జరుగుతుంది.

జ్యేష్ఠ మంగళవారం రోజున హనుమంతుడు అడవిలో తొలిసారి శ్రీరాముడిని కలుసుకున్నాడని నమ్మకం ఉంది. అందుకే దీనిని మహా మంగళవారం అని కూడా అంటారు. ఈ రోజుల్లో హనుమంతుడికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. మొత్తం నెలలో ఐదు మంగళవారాలు మే 24, 31 మే, 7 జూన్, 14 జూన్ ఉంటాయి.

ఈ రోజు హనుమంతుడిని పూజించడం వల్ల విశేష పుణ్యఫలం లభిస్తుంది. ఈ రోజున హనుమంతుడిని పూజించడం వల్ల మేలు జరుగుతుంది. భక్తుల కష్టాలన్నీ తొలగిపోతాయి. మహా మంగళ వారం రోజున ఉపవాసం ఉండి హనుమంతుడిని పూజించాలి. అలాగే, హనుమాన్ యొక్క చాలీసాను పఠించండి. ఈ రోజున బజరంగ్ బాణ్ పఠించడం కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

ఈ రోజున, ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత, హనుమాన్ సింధూర తిలకం వేసి పూజించండి. ఎరుపు రంగు అంటే హనుమంతుడికి చాలా ఇష్టం. అందుకే ఈ రోజు ఎరుపు రంగు వస్తువులకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఈ రోజున ఎరుపు రంగు వస్తువులను దానం చేయడం లేదా ఎరుపు రంగు వస్త్రాలను దానం చేయడం విశేష ఫలితాలను ఇస్తుంది.