astrology

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సంవత్సరం చాలా అదృష్ట కలయికలు ఉన్నాయి. ముఖ్యంగా డిసెంబర్ 21వ తేదీన బుధుడు, శని గ్రహాలు రెండు 25 సంవత్సరాల తర్వాత కలయికలో ఉంటున్నాయి. శని, బుధ గ్రహం 60 డిగ్రీల వద్ద ఉండడం వల్ల త్రీ ఏకాదశి యోగం ఏర్పడుతుంది. ఈ కలయిక వల్ల మూడు రాశులు వారికి జీవితంలో అనేక సుఖాలను పొందుతారు. అంతేకాకుండా ఆ అదృష్టం మీ వెంటే ఉంటుంది. ఆ అదృష్ట రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కన్యా రాశి- కన్య రాశి వారికి ఈ సంవత్సరం చాలా శుభవార్తలు ఉంటాయి. ఏకాదశి యోగం వల్ల వీరికి సానుకూల ఫలితాలు ఉంటాయి. మీరు పని చేసే చోట పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. కొత్త సంవత్సరంలో మీకు ఇంక్రిమెంట్ తో పాటు ప్రమోషన్ కూడా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత నెలకొంటుంది పాత పెట్టుబడుల నుండి ఊహించని ఆర్థిక లాభాలు వస్తాయి. ఇది మీ ఆర్థిక సమస్యలను బయటపడేస్తుంది. ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు. కోర్టు సమస్యల నుండి బయటపడతారు.

Vastu Tips: వాస్తు ప్రకారం ఇంట్లో ఏ దిశలో కూర్చొని భోజనం చేయాలో ...

మేషరాశి- మేష రాశి వారికి ఈ సంవత్సరం చివరన అనేక ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉన్నాయి. కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారికి వారి కెరీర్ లో మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులు అన్నీ కూడా మీకు అనుకూలంగా వస్తాయి. దీని కారణంగా మీకు ఉపశమనం లభిస్తుంది. శని భగవానుడి ఆశీస్సులు మీపైన ఎల్లప్పుడూ ఉంటాయి. దీనివల్ల మీకు ఆరోగ్యపరమైన సమస్యలు ఉండవు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. విదేశాలలో చదువుకోవాలని నెరవేరుతుంది..

మకర రాశి- మకర రాశి వారికి శని, బుధుడు కలయిక మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మంచి విజయం ఉంటుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వారికి ఆర్థిక లాభాలు పొందుతారు. దీర్ఘకాలికంగా ఇబ్బంది పడుతున్న అనారోగ్య సమస్య నుంచి ఉపశమనం పొందుతారు. దీని వల్ల మీకు సంతోషం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.