జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి నెలలో ఒక గ్రహం సంచరిస్తూనే ఉంటుంది. ఇది అన్ని రాష్ట్రాల వారిని ప్రభావితం చేస్తూ ఉంటుంది. డిసెంబర్ 16వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంట 20 నిమిషాలకు చంద్రుడు వృషభ రాశిలోకి సంచరించబోతున్నాడు. ప్రస్తుతానికి గురుడు ఇప్పటికే ఆ రాశిలో ఉన్నాడు .ఈ రెండు పెద్ద గ్రహాల కలయిక వల్ల రేపు గజకేసరి యోగం ఏర్పడుతుంది. దీనివల్ల మూడు రాశుల వారికి చాలా మేలు జరుగుతుంది. మీరు ఏ పని ప్రారంభించిన మంచి ఫలితాలు వస్తాయి. ఆ అదృష్ట రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి- మేష రాశి వారికి గురుగ్రహం చంద్రగ్రహాల కలయిక వల్ల గజకేసరి యోగం ఏర్పడుతుంది. డిసెంబర్ 16 నుండి వీరి ఆదాయానికి సంబంధించిన కొత్త మనరులు ఏర్పడతాయి సొంతంగా వ్యాపారం వ్యాపారం చేయాలనుకునే కళ నెరవేరుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి. మీపై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. ఉద్యోగం నిలో జీతం పెరుగుతుంది. దీని కారణంగా మీరు సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో అన్యోన్యంగా గడుపుతారు.
Vastu Tips: వాస్తు ప్రకారం బెడ్రూంలో మంచం ఏ దిశలో ఉండాలి,
సింహరాశి -సింహరాశి వారికి గజకేసరి యోగం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. వీరికి ఓపిక కృషి ఎక్కువగా ఉండటం ద్వారా ఫలితాలు వీరికి అనుకూలంగా వస్తాయి. జీవితము ఆనందంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో మంచి సమన్వయం ఉంటుంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. మీరు పెట్టుబడి కోసం విదేశాల్లో పెట్టుబడి పెట్టాలనుకున్న కళ నెరవేరుతుంది. విద్యార్థులు కోరుకున్న రంగాల్లో సీటు లభిస్తుంది. ఇది తల్లిదండ్రులకు ఆనందాన్ని కలిగించే విషయం దూర ప్రయాణాలకు విహారయాత్రలకు వెళతారు. కోర్టు సమస్యలు తొలగిపోతాయి.
మకర రాశి- మకర రాశి వారికి గజకేసరి యోగం వల్ల అనేక శుభ ఫలితాలు ఉన్నాయి. ఆర్థిక సమస్యలు దూరమయ్యే సమయం దగ్గరపడింది. ఈ చంద్రుడు గురు గ్రహ కలయిక వల్ల మీ కు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆదాయం గతం కంటే మెరుగుపడుతుంది. పాత అప్పులను చెల్లించగలుగుతారు. నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉండవు. కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లాలనుకునే ప్లాన్ నెరవేరుతుంది. ఎప్పటినుంచో కొనుగోలు చేయాలనుకుంటున్న నూతన గృహం కళ నెరవేరుతుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.