astrology

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం డిసెంబర్ 1 నా కార్తీక అమావాస్య సందర్భంగా ధృతి యోగం ఏర్పడుతుంది. ఇది చాలా పవిత్రమైన యోగంగా చెప్తారు. ఆదివారం అమావాస్య కావడంతో అనేక శుభ ఫలితాలను తీసుకొస్తుంది. ముఖ్యంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం ఉంటుంది. ఆ మూడు అదృష్ట రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

మకర రాశి- మకర రాశి వారికి కార్తిక అమావాస్య చాలా శుభప్రదంగా ఉంటుంది. మీ అదృష్టం పెరుగుతుంది. మీకు ఆకస్మికంగా ధన లాభం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు తొందరగా పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు పొందుతారు. కొత్త కస్టమర్లు వస్తారు పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం నుంచి మంచి పథకాల నుండి లబ్ధి పొందుతారు. చాలా కాలంగా నిలిచిపోయిన ప్రాజెక్టు పనులన్నీ విజయం సాధిస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళతారు. ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉండవు.

Vastu Tips: వాస్తు ప్రకారం ఇంటికి ఎన్ని ద్వారాలు ఉండాలి, 

తులారాశి- తులారాశిలో జన్మించిన వారికి ధృతి యోగం చాలా శుభప్రదంగా ఉంటుంది. మీకు వ్యక్తిగత జీవితంలో ఆనందం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు బలపడతాయి. ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆకస్మికంగా ధన లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కోర్టు సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపార కార్యకలాపాలలో కొత్త ప్రణాళికలు అమలు చేస్తారు. ఉద్యోగం చేసే వారికి పదోన్నతి పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీని కారణంగా మీ ఆర్థిక స్థితి మరింతగా మెరుగుపడుతుంది. కొత్త ఆదాయ వనరులు వస్తాయి. ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు. ఇది మానసికంగా ప్రశాంతతను ఇస్తుంది.

వృశ్చిక రాశి- వృశ్చిక రాశి వారికి కార్తీక అమావాస్య చాలా శుభప్రదంగా చెప్పవచ్చు. వీరు విజయాలను సాధిస్తారు. మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. డబ్బు సంపాదించే ప్రయత్నంలో మీరు విజయాన్ని సాధిస్తారు. వ్యాపారాన్ని విస్తరించేందుకు విదేశాల్లో పెట్టుబడులు పెడతారు. ఇది మీకు మంచి లాభాలను తీసుకువస్తుంది. కొత్త వ్యాపార ఒప్పందాలను అవలంబించుకునే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం పెరుగుతుంది. దీనివల్ల మీకు లాభం ఉంటుంది. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. విదేశాల్లో చదువుకోవాలని కదా నెరవేరుతుంది. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తొలగిపోతాయి ప్రేమ వివాహాలకు అనుకూలం.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.