జూన్ 29వ తేదీన ఆషాడ ఏకాదశి అవుతోంది అయితే ఏకాదశి చాలా శుభకడియలను తేబోతోంది ముఖ్యంగా మూడు రాశుల వారికి ఆషాడ ఏకాదశి అనేది అదృష్టాన్ని ఇస్తుందని పండితులు చెబుతున్నారు ముఖ్యంగా మకర రాశి కుంభరాశి అలాగే మీన రాశికి చెందిన వారికి ఆషాడ ఏకాదశి నుంచి సరిగ్గా 15 రోజులపాటు శుభ ఘడియలు కొనసాగుతాయని పండితులు చెబుతున్నారు
మకర రాశి
మకర రాశి వారికి జూన్ 29వ తేదీ నుంచి శుభ ఘడియలు ప్రారంభం కానున్నాయి ముఖ్యంగా వ్యాపారస్తులకు ఈ పదిహేను రోజులు ఒక రకంగా చెప్పాలంటే లాటరీ లాంటిదే అని చెప్పవచ్చు ఈ 15 రోజులు పాటు వ్యాపారంలో మంచి లాభాలను పొందే అవకాశం ఉంది అలాగే ఉద్యోగస్తులు ప్రమోషన్లను పొందుతారు దీంతోపాటు విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకు సాధించే అవకాశం ఉంది. నిరుద్యోగులు సైతం ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఈ 15 రోజులపాటు సుబ్రహ్మణ్యస్వామి పటం ఎదుట దీపం వెలిగిస్తే మీకు అంతా శుభం జరుగుతుంది.
కుంభరాశి
కుంభ రాశి వారికి జూన్ 29వ తేదీ నుంచి అదృష్ట ఘడియలు ప్రారంభం కానున్నాయి. ఈ రాశి వారు వ్యాపారం ప్రారంభించడానికి ఇది ఒక మంచి సమయం అనే చెప్పాలి. అంతేకాదు కుంభ రాశి వారికి ఆకస్మికంగా ధనయోగం ప్రాప్తించే అవకాశం ఉంది. దీంతోపాటు మీరు ఈ 15 రోజుల్లో శుభవార్తలు వినే అవకాశం ఉంది. కుంభ రాశి వారు జూన్ 29 నుంచి 15 రోజులపాటు ఆంజనేయ స్వామి పటం ఎదుట పాలల్లో ఉడికించిన అన్నం పెట్టడం ద్వారా మీకు అంతా శుభం జరుగుతుంది.
మీన రాశి
మీన రాశి వారికి జూన్ 29వ తేదీ నుంచి పట్టిందల్లా బంగారం కానుంది ముఖ్యంగా ఈ రాశి వారు ఈ తేదీ నుంచి 15 రోజులపాటు వ్యాపారంలో లాభాలు పొందే అవకాశం ఉంది. అంతేకాదు మీన రాశి వారు వివాహ ప్రయత్నాలు. ఫలించే అవకాశం ఉంది దీంతో పాటు విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు మీన రాశి వారు 15 రోజులపాటు దుర్గాదేవి పటం ఎదుట పాలతో చేసిన అన్నం పాయసం నైవేద్యంగా పెట్టడం ద్వారా మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది.