చాలామంది అప్పుల సమస్యతో బాధపడుతూ ఉంటారు. అప్పు అనేది ఒక శాపం లాగా మారింది. ఇది సంతోషకరమైన జీవితాలను నాశనం చేస్తుంది. దీనిలో చిక్కుకున్న వ్యక్తి ఎంత ప్రయత్నించినా దాని నుంచి తప్పించుకోలేడు అప్పువల్ల ఒత్తిడి అనారోగ్యం తగాదాలు మానసిక ఇబ్బందులు కూడా పెరుగుతాయి. ఈ సమస్యను ఎదుర్కొంటున్న వారు ఈ సమస్య నుంచి బయటపడడానికి వినాయకుడిని ధ్యానం చేయడం మంచిది. అంతేకాకుండా కొన్ని రకాల పరిష్కారాలు చేసినట్లయితే అప్పుల సమస్య నుంచి తొందరగా బయటపడతారు. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మంగళవారం నాడు అప్పులు చెల్లించండి- మీరు ఒకవేళ అప్పులు చేసినట్లయితే ఆ అప్పు తీరకుండా ఉన్నట్లయితే మీరు మంగళవారం రోజు అప్పులు తిరిగి చెల్లిస్తే ఖచ్చితంగా మీకు అప్పుల బాధనుండి బయటపడతారు. ముందుగా గణేష్ ని ఆలయానికి వెళ్లి కొబ్బరికాయలు కొట్టి, బెల్లము ,కొబ్బరికాయను సమర్పించి మీరు అప్పు తీసుకున్న వారి దగ్గరికి వెళ్లి కొంత మొత్తాన్ని చెల్లించినట్లయితే మీకు అప్పుల బాధ నుండి తొందరగా ఉపశమనం లభిస్తుంది.
Vastu Tips: వాస్తు ప్రకారం బెడ్రూంలో మంచం ఏ దిశలో ఉండాలి,
చతుర్థి నాడు వినాయకుడిని పూజించండి- అప్పుల బాధతో బాధపడుతున్న వారు వారి రుణ విముక్తి కోసం చతుర్ధినాడు వినాయకుడిని పూజించాలి. చతుర్థి రోజు వినాయకుని పూజ చేసి వినాయకుడికి ఉండ్రాళ్ళు సమర్పించినట్లయితే త్వరలోనే మీరు అప్పుల బాధ నుండి బయటపడతారు. అంతేకాకుండా ఆ వినాయకుడి ఆశీస్సుల కోసం చతుర్ధి నాడు వినాయకుడికి అభిషేకం చేయడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల మీ కష్టాలు తొలగిపోతాయి. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు.
ఈ స్తోత్రాన్ని చదవండి- అప్పుల బాధ నుండి బయటపడడానికి శ్రీ గణేశ స్తోత్రం ని ఆరు నెలలపాటు క్రమం తప్పకుండా చదవడం ద్వారా ఆ వినాయకుని ప్రత్యేక అనుగ్రహం మీ పైన ఉంటుంది. దీని ద్వారా మీ సంపద పెరుగుతుంది. రుణాలు తిరిగి తొందరగా చెల్లిస్తారు. అంతేకాకుండా ఆర్థికపరమైన ఇబ్బందులు అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.