పెళ్లి అనేది జీవితంలో ఒక మధురమైన ఘట్టం.. అందుకే ఆచితూచి అడుగు ముందుకు వేయాలి. వివాహానికి ముందు రాశులను కూడా చూడాలి.. ఇవి కూడా మీ జీవితాన్ని ఆనంద మయం చేయడానికి దోహద పడతాయి.. అందుకే ఒకటికి రెండు సార్లు జాతకాలను పరిశీలించి మరి చూస్తారు.. జన్మ రాసులు కలవక పోతే జీవితాంతం సమస్యలు కూడా వస్తాయి.. మరి పెళ్లితో మీ జీవితంలో అడుగు పెట్టబోయే అమ్మాయి ఇలా ఉండాలి.. మా ఇంట్లో వారితో కలిసి పోవాలి.. ఆనందంగా ఉండాలి.. అని కోరుకుంటూ ఉంటారు.. కానీ పెళ్ళికి ముందే ఆ అమ్మాయి ఎలా ఉంటుందో మనకు తెలియదు.. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏ రాశికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మీకు బాగా కలిసి వస్తుందో.. మీ దశ తిరుగుతుందో చూద్దాం..
కర్కాటకం :
ఈ రాశికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మీ బంధం మరింత దృడంగా ఉంటుంది.. కుటుంబ సభ్యులను ప్రేమగా పలకరిస్తుంది.. ప్రతి విషయాన్నీ ఎంతో బాధ్యతగా నిర్వహిస్తుంది.
మేషరాశి :
ఈ రాశి ఉన్న స్త్రీలు భర్త అడుగుజాడల్లోనే నడుస్తారు.. ప్రతి పనిలో తన మార్కు ఉండాలని కోరుకుంటారు.. భర్త, కుటుంబం పట్ల బాధ్యతగా వ్యవహరించడమే కాకుండా అందరు కలిసి ఉండాలని కోరుకుంటుంది.. అలాగే సమర్ధుడైన భర్త తన పక్కన ఉండాలని అనుకుంటుంది..
సింహం:
ఈ రాశి ఉన్న అమ్మాయిలు చాలా శక్తి వంతులు.. ఆకర్షణీయమైన రూపంలో ఉంటారు.. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే సత్తా ఉంటుంది.. సింత నిర్ణయాలు తీసుకునే సత్తా ఉండడమే కాకుండా వారి తెలివితో సమస్యలను పరిష్కరిస్తారు. ఈ రాశి వారిని మీరు పెళ్లి చేసుకుంటే మీ దశ తిరిగి పోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.