astrology

Astrology: జ్యోతిష శాస్త్రం ప్రకారం గురు గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ గ్రహం ఆనందాలను, ఐశ్వర్యాలను, భావోద్వేగాలను ఇచ్చేదిగా ఉంటుంది. గురు గ్రహం ఫిబ్రవరి 4వతేదీన ఉదయం 8 గంటల 15 నిమిషాలకు తన రాశిని మార్చుకుంటుంది. గురుగ్రహం ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తుంది. దీని ద్వారా మూడు రాశుల వారికి ఐశ్వర్యం లభిస్తుంది. ఆ అదృష్ట రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

కన్యా రాశి- కన్య రాశి వారికి గురు గ్రహ రాశి మార్పు కారణం చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. వీరికి ఆదాయం. పెరిగే అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడి పెట్టిన దగ్గర నుంచి మంచి లాభాలు వస్తాయి సొంత వాహనాన్ని కొనుగోలు చేస్తారు. మీరు కోరుకున్న కోరికలు నెలాఖరులోపు నెరవేరే అవకాశాలు ఉన్నాయి. భౌతిక సుఖాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. వివాహితులకు మానసిక ప్రశాంతత ఉంటుంది.

Vastu Tips: మీ బెడ్ రూం నుండి ఈ 5 వస్తువులను వెంటనే తొలగించండి ...

మీన రాశి- మీన రాశి వారికి గురు గ్రహ సంచారము శుభప్రభావాలను చూపిస్తుంది. ఈ రాశి వారికి కొత్త వ్యాపారం ప్రారంభించడం చాలా లాభాలను తీసుకొని వస్తుంది. వ్యాపారవేత్త ఒప్పందాలలో విజయాలను సాధిస్తారు. వివాహం కాని వారికి వివాహము అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రకు వెళతారు. కోర్టు సమస్యలు తొలగిపోతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు.

వృషభరాశి- వృషభ రాశి వారికి గురు గ్రహ సంచారం సానుకూల ప్రభావాలను ఇస్తుంది విదేశాలకు వెళ్లాలనుకునే వారికి అవకాశం లభిస్తుంది. వివాహం కాని వారికి వివాహమై అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వివాహాలకు అనుకూలం. ఆర్థిక పరిస్థితి రాబోయే రోజుల్లో బలంగా మారుతుంది. తీవ్రమైన వ్యాధుల నుంచి కూడా ఉపశమనాన్ని పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు. తల్లితండ్రులకు ఎంతో సంతోషంగా ఉంటుంది. ఎప్పటినుంచో కొనాలనుకుంటున్న సొంత ఇంటి కల నెరవేరుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి లాభాలు ఎక్కువగా ఉంటాయి.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.