Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారంచంద్ర గ్రహణానికి కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ గ్రహం ఫిబ్రవరి 8వ తేదీన రాత్రి 11 గంటల 20 నిమిషాలకు వృషభ రాశిలోకి ప్రవేశిస్తుంది. దీని కారణంగా మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ అదృష్ట రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
వృశ్చిక రాశి- వృశ్చిక రాశి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా సానుకూల ఫలితాలను అందిస్తుంది. గౌరవం పెరుగుతుంది. మీరు పని చేసే చోట పురోగతి ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు సామాజిక సేవలో ఇష్టం పెరుగుతుంది. సంపద పెరుగుతుంది. ఆదాయం ఘననీయంగా పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు ఉంటుంది. ఒత్తిడి లేకుండా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళతారు. సమస్యలు తొలగిపోతాయి. ఇది మానసిక ఆందోళన తొలగిస్తుంది.
Vastu Tips: వాస్తు ప్రకారం బెడ్రూంలో మంచం ఏ దిశలో ఉండాలి,
సింహరాశి- సింహరాశి వారికి చాలా శుభప్రదం ఆర్థిక పరిస్థితి గతం కంట మెరుగ్గా ఉంటుంది. వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ సంబంధాలకు అనుకూలం కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఎప్పటినుంచో కొనాలనుకుంటున్న సొంత ఇంటి కలలను నెరవేరుతుంది. ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది. జీతం పెరుగుతుంది వ్యాపారస్తులకు వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి.
కర్కాటక రాశి- కర్కాటక రాశి వారికి చంద్రుని అనుగ్రహం వల్ల చాలా మేలు జరుగుతుంది. వీరికి అన్ని సానుకూల ప్రభావాలు ఉంటాయి. ఎప్పటినుంచ ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు. ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న పనులను త్వరగా పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సృజనాత్మకత కలల రంగాల్లో ఉన్నవారికి మంచి లాభాలు ఉంటాయి. ఉద్యోగం మారాలనుకునే వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. విదేశాల్లో చదువుకోవాలని నెరవేరుతుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.