astrology

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహానికి కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అయితే ఏ గ్రహమైన తన వ్యతిరేక దిశల్లో కదిలినప్పుడు కొన్ని రాశుల వారికి ఇబ్బంది కలిగిస్తుంది. అయితే 12 రాశుల పైన కొన్ని ప్రభావాలు ఉన్నప్పటికీ ముఖ్యంగా డిసెంబర్ 8వ తేదీన కుజ గ్రహం వ్యతిరేక దిశలో ప్రయాణం వల్ల ఈ మూడు రాశులువారికి కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ మూడు రాశులు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మకర రాశి- మకర రాశి వారికి కూచోడు తిరోగమన కదలిక వలన కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎవరితో అన్న మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. లేకపోతే అనవసర గొడవల్లో ఇరుక్కుంటారు. దీని ద్వారా మీకు మనశ్శాంతి కోల్పోతుంది. అంతే కాకుండా జీవిత భాగస్వామితో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే గొడవల వల్ల విడాకులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు పని చేసే చోట సహోదయోగులతో గొడవల అయ్యే ప్రమాదం ఉంది. అంతేకాకుండా దూర ప్రయాణాలకు వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్లడం మంచిది రోడ్డు ప్రయాణాలు మానుకుంటే ఉత్తమం.

ధనస్సు రాశి- ధనస్సు రాశి వారికి కుజుడు తిరోగమనడం వల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు చుట్టూ ముడతాయి అప్పుల బాధ పెరుగుతుంది. ఖర్చులు ఎక్కువ అవుతాయి. సంపాదించిన దాని కంటే ఖర్చులు అధికంగా అవుతాయి. కుటుంబ సభ్యుల్లో అనారోగ్య సమస్యలు వస్తాయి. ధన నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు పని చేసే చోట కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పని విషయంలో ఆలస్యం చేస్తారు. దీని వల్ల మీ యజమాని మీ పైన కోపంగా ఉండే ఆస్కారం ఉంటుంది. కుటుంబ సభ్యుల్లో ఒకరికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. విద్యార్థులు చదువుల్లో అంత ఆసక్తిని చూపించరు. దీనిలో దీనివల్ల తల్లిదండ్రుల్లో ఆందోళన పెరుగుతుంది.

Vastu Tips: వాస్తు ప్రకారం బాత్రూంలో ఈ ఏడు వస్తువులు ఉంచారో, దరిద్రం ..

మిథున రాశి- మిధున రాశి వారికి కుజుడి తిరోగమన సంచారం కారణంగా కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. వీరు పని చేసే చోట ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. రాజకీయపరమైన వ్యక్తుల వల్ల మీకు కొన్ని ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరితో అయినా కాస్త జాగ్రత్తగా మాట్లాడడం మంచిది గొడవలకు దూరంగా ఉంటే మంచిది కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. వాటిని చాకచక్యంగా పరిష్కరించుకోవడం మీ చేతిలోనే ఉంటుంది. అప్పుల బాధ ఎక్కువవుతుంది. ఇంట్లో ప్రశాంతత లోపిస్తుంది. ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళకండి. నూతన గృహాన్ని కొనుగోలు చేయాలనుకునే కళ కాస్త జాప్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థుల్లో చదువు పైన ఆసక్తి తగ్గుతుంది. కోరుకున్నచోట సీటు లభించదు. ఇది తల్లిదండ్రులలో ఆందోళన కలిగించే అంశంగా మారుతుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.