Astrology: జ్యోతిషా శాస్త్రం ప్రకారం 9 గ్రహాల్లో బుధుడు చాలా అత్యంత వేగంగా కదిలే గ్రహం అంతేకాకుండా అనేక శుభ ఫలితాలను అందించే గ్రహంగా కూడా చెప్పవచ్చు. జనవరి 22వ తేదీన బుధ గ్రహం సంచారం జరుగుతుంది. ఈ రోజున బుధ గ్రహం ఉత్తరాషాడ నక్షత్రంలోనికి ప్రవేశించడం ద్వారా మూడు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తి కలిగే యోగం ఉంది. వీరు పట్టిందల్లా బంగారమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఆ అదృష్ట రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
మీన రాశి- మీన రాశి వారికి బుదిని సంచారం అనేక శుభ ఫలితాలను తీసుకొని వస్తుంది. ఈ రాశి వారికి ఆర్థికపరమైన లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వారికి మంచి లాభాలు వస్తాయి. వ్యాపార పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. వ్యాపారాన్ని విదేశాల్లో పెట్టాలనుకునే వారికి ఇది మంచి సమయం కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది.
Vastu Tips: వాస్తు ప్రకారం ఇంటికి ఎన్ని ద్వారాలు ఉండాలి,
సింహరాశి- సింహ రాశి వారికి మొదటి సంచారం అనేక సార్కుల ఫలితాలను అందిస్తుంది. ముఖ్యంగా ఉత్తరాషాఢ నక్షత్రంలోనికి ప్రవేశించడం ద్వారా ఈ రాశి వారికి మంచి శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు వస్తాయి. ప్రేమ వివాహాలకు అనుకూలం కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. కోర్టు సమస్యలు తొలగిపోతాయి. అప్పుల బాధ తొలగిపోతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు కోరుకున్నచోట సీటు లభిస్తుంది. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు.
తులారాశి- తులారాశి వారికి బుధని సంచారం అనేక సానుకూల ఫలితాలను అందిస్తుంది. ఈ రాశి వారికి ఏలినాటి శని తొలగిపోతుంది. అదృష్టం కలిసి వస్తుంది. కోటీశ్వరులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఖర్చులు తగ్గుతాయి ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్స్ లభిస్తాయి. కోరుకున్నచోట బదిలీ అవుతుంది. మీ పని పట్ల పై అధికారులు సంతోషంగా ఉంటారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.