Astrology: జ్యోతిష శాస్త్రం ప్రకారం రెండు గ్రహాలు ఒకే రాశిలోకి ప్రవేశించడం చాలా శుభ సంకేతంగా చెప్పవచ్చు. జనవరి 30వ తేదీన సూర్యగ్రహం ,శని గ్రహం రెండు కూడా కుంభ రాశిలోకి ప్రవేశిస్తున్నయి. దీని కారణంగా ఈ మూడు రాశుల వారికి ఆకస్మిక ధన లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరి ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి. ఆ అదృష్ట రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ధనస్సు రాశి- ధనస్సు రాశి వారికి సూర్యుడు శని గ్రహాల కలయిక మంచి శుభ ఫలితాలను అందిస్తుంది. భార్య భర్తల మధ్య మనస్పర్ధలు తొలగిపోతాయి. వివాహం కాని వారికి వివాహమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం వీరికి శుభ ఫలితాలు లభిస్తాయి. ఆర్థిక నష్టాలు తొలగిపోతాయి. ఆకస్మిక ధన లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కోర్టు సమస్యలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళతారు.
Vastu Tips: శని మిమ్మల్ని పట్టి పీడిస్తోందని భావిస్తున్నారా
కర్కాటక రాశి- కర్కాటక రాశి వారికి సూర్యుడు శని గ్రహాలు కుంభరాశిలోకి ప్రవేశించడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మంచి లాభాలు వస్తాయి. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఇది మీకు మానసిక సమస్యల నుంచి బయటపడేస్తుంది. వ్యాపార విస్తరణ కోసం మీరు చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలను అందిస్తాయి. విదేశాల్లో పెట్టుబడులు పెడతారు. సామాజిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి.
కుంభరాశి- కుంభ రాశి వారికి సూర్యుడు శని గ్రహాల కలయిక మంచి శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ సంవత్సరం వీరికి మంచి లాభాలు వ్యాపారంలో వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఎప్పటినుంచో కొనాలనుకుంటున్న సొంత ఇంటి కల నెరవేరుతుంది. కోర్టు సమస్యలు తొలగిపోతాయి. ఆకస్మిక ధన లాభం వస్తుంది. పూర్వీకులు నుండి రావాల్సిన ఆస్తులు వస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో కలిసి గడుపుతారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.