జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహువు కేతువులు జాతకంలో బలమైన స్థానంలో ఉంటే వీరు అనేక రకాల నష్టాలను ఎదుర్కొనవలసి వస్తుంది. ఇది 12 రాశుల వారిని ప్రభావితం చేస్తుంది. కొన్నిసార్లు రాహు కేతువులు కొన్ని రాశుల వారికి మేలు చేస్తారు. అయితే నవంబర్ 30న రాహు కేతువులు రాశి మార్పు ఉంటుంది. రాహు మీనరాశిని వదిలి కుంభ రాశిలోకి ప్రవేశిస్తే కేతువు కన్యారాశిని వదిలి సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ పరిస్థితుల్లో రాహు, కేతువులు మూడు రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తారు. ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
వృషభ రాశి- వృషభ రాశి వారికి రాహు కేతువుల రాశి మార్పు కారణంగా అనేక శుభ ఫలితాలు కలిగి ఉంటాయి. ఆకస్మిక ధన లాభం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరికి ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది. దీని ద్వారా ఆదాయం పెరుగుతుంది. వ్యాపారం చేసే వారికి భారీ లాభాలు అందుతాయి. సామాజిక కార్యక్రమాలు చేసే వారికి సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు పని చేసే చోట మీకు గౌరవం లభిస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. రాహు కేతు మీకు ఆశీస్సులు ఉంటాయి.
Vastu Tips: ఇంట్లో తాజ్ మహల్ ఫోటో పెట్టుకున్నారా అయితే జాగ్రత్త ...
మకర రాశి- మకర రాశి వారికి రాహు కేతువులో రాశి మార్పు కారణంగా చాలా శుభప్రదంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాలలో సాధిస్తారు. ఇది కుటుంబంలో ఆనందాన్ని తీసుకువస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తొలగిపోతాయి. కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఇది శుభ సమయం. ప్రేమ వివాహాలకు అనుకూలం. కుటుంబ సభ్యుల మధ్యతో ఉంటుంది. వ్యాపార విస్తరణ కోసం విదేశాల్లో పెట్టుబడులు పెడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విదేశీ పర్యటనలకు వెళతారు. మీ సహ ఉద్యోగుల నుండి మద్దతు లభిస్తుంది. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు.
సింహరాశి- సింహ రాశి వారికి రాహు కేతు పంచారం కారణంగా అనేక ఫలితాలు ఉన్నాయి. వీరికి అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కెరీర్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రభుత్వ ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్ లభిస్తుంది. దీని ద్వారా జీతం రెట్టింపు అవుతుంది. ఆదాయం పెరుగుతుంది. మీరు వ్యాపారంలో పురోగతి ఉంటుంది. విద్యార్థులు కోరుకున్న రంగాల్లో రాణిస్తారు. సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళతారు. నూతన వాహనాన్ని కొనుగోలు చేయాలని నెరవేరుతుంది. ఆరోగ్యపరంగా ఇటువంటి సమస్యలు ఉండవు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.