astrology

సూర్యుడిని గ్రహాల దేవుడు అని అంటారు. సూర్యదేవుని అనుగ్రహం వల్ల అన్ని రాశుల వారికి సానుకూల ప్రభావాలు ఉంటాయి. డిసెంబర్ 15న రాత్రి 9 గంటల 50 నిమిషాలకు సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీని కారణంగా అన్ని రాసి చక్ర గుర్తులపైన సూర్యని అనుగ్రహం ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ అదృష్ట రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ధనస్సు రాశి- సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి అనేక ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. విదేశాలకు వెళ్లాలనుకునే కళ నెరవేరుతుంది. వీరికి మంచి అవకాశం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పాత బిల్లులు చెల్లించ గలుగుతారు. మీ పిల్లలకు చదువుకు సంబంధించిన మంచి సమాచారం లభిస్తుంది. విద్యార్థులు ఉత్తీర్ణులు అవుతారు. వారి ఆసక్తి కనుగుణంగా మీరు ముందడుగు వేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ప్రేమ వివాహాలకు అనుకూల కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది.

తులారాశి- తులారాశి వారికి డిసెంబర్ 15 తర్వాత అదృష్టం ఒక్కసారిగా మారుతుంది. ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి. కెరీర్ పరంగా అత్యంత వేగంతో మీరు ముందుకు అడుగులు వేస్తారు. మీ లక్ష్యాలను తెలివిగా సాధిస్తారు. దీని కారణంగా యజమాని మీతో సంతోషంగా ఉంటారు. మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్లు లభిస్తాయి. ఖర్చులు తగ్గుతాయి. ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉండవు.

మిథున రాశి- మిధున రాశి వారికి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. వీరి పైన ఎప్పుడు దయ చూపిస్తాడు. ఏ పనిలోనైనా విజయాన్ని సాధించగలుగుతారు. పై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. కొత్త సంవత్సరంలో కొత్త బాధ్యతలు ప్రమోషన్లు పొందుతారు. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. విదేశాలకు వెళ్లాలనుకునే కళ నెరవేరుతుంది. వ్యాపారం పెట్టుబడి కోసం ఇది మంచి సమయం. నూతన గృహాన్ని కొనుగోలు చేయాలనుకునే కళ నెరవేరుతుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.