Astrology: సూర్యుడి అనుగ్రహంతో ఈ 5 రాశుల వారికి నెల రోజుల పాటు పట్టిందల్లా బంగారమే, వ్యాపారంలో విజయం, లాటరీ తగిలే అవకాశం, మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి..
planet astrology

Astrology:  మే18 అంటే నేటి నుంచి రవి వృషభ రాశిలోకి ప్రవేశించనున్నాడు. మిథున రాశి నుంచి వృషభ సంచారం చేయనున్నాడు రవి. ఈ కారణంగా పలు రాశిల వారికి అనుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఏయే రాశుల వారికి రవి అనుకూలంగా ఉంటాడో ఒకసారి చూద్దాం.

మేష రాశి: ఈ రాశికి రెండో ఇంట్లో రవి సంచారం జరుగనుంది. అంటే మేష రాశికి ధన స్థానంలోకి(ద్వితీయ స్థానం) రవి రానున్నాడు. దాంతో ఈ రాశివారికి ఆర్థికంగా లాభం చేకూరనుంది. అనుకున్న ప్రణాళిక సాఫీగా సాగే అవకాశం ఎక్కువగా ఉంది.

వృషభం: ఈ రాశిలోకే రవి సంచారం జరగడం వల్ల వృషభ రాశి వారికి అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ సమయంలో ఉద్యోగస్థులకు ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. అలాగే వ్యాపార రంగంలో ఉన్న వారు కూడా తమ వ్యాపారాన్ని మరింతగా విస్తరించే అవకాశాలు ఎక్కువ. ఆర్థికంగా మరింత మెరుగవుతారు. కుటుంబ పరంగా కూడా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే అవకాశాలు ఉన్నాయి.

కర్కాటక రాశి: ఈ రాశికి 11వ ఇంట రవి సంచారం ఉంటుంది. అంటే ఇది లాభ స్థానం. దాంతో ఈ రాశి వారు ఆర్థికంగా పుంజుకునే అవకాశం ఉంది. ఉద్యోగం, వ్యాపార రంగాల్లో వారికి ఇది చక్కటి కాలం. సంఘంలో గౌరవం పెరుగుతుంది.

సింహ రాశి: ఈ రాశికి 10వ ఇంట అంటే దశమ స్థానంలో రవి సంచరించనున్నాడు. రవి మార్పుతో ఊహించని విజయాలు చూసే అవకాశం ఉంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ రాశిలో ఉన్న ఉద్యోగస్తులకు ఇదొక మంచి అవకాశం. వీరు అనుకున్న పనులు సాఫీగా సాగే అవకాశం ఉంది. అవాంతరాలకు పెద్దగా ఆస్కారం లేదు.

కన్యా రాశి: ఈ రాశి వారికి తొమ్మిదో ఇంట అంటే భాగ్య స్థానంలో రవి సంచారం జరుగనుంది. ఇది కన్యా రాశి వారికి మిక్కిలి లాభించే అవకాశం ఉంది. రవి సంచారం ఉన్న నెలలో వీరు విజయాలు సొంతం చేసుకునే అవకాశం ఉంది.