పూల జాతర మన బతుకమ్మ ! మన సంస్కృతి సంప్రదాయాలకు పట్టుగొమ్మ !! రంగురంగుల తీరొక్క పూలతో అందంగా పేర్చి ఆడబిడ్డలంతా ఒక్క దగ్గర చేరి పాటలు పాడుతూ బతుకమ్మ ఆడే విలక్షణ సంస్కృతి తెలంగాణకు అందిన ఒక గొప్ప సంప్రదాయం. తెలంగాణ ఉద్యమంలోనూ బతుకమ్మ కీలక పాత్ర పోషించింది. తెలంగాణ అస్థిత్వానికి ప్రతీక మన బతుకమ్మ పండుగ. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయలకు ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను ప్రజలందరు సంతోషంగా జరుపుకుంటారు. పూలను పూజించి, ప్రకృతిని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ. ఈ సందర్భంగా మీ స్నేహితులకు ఇలా శుభాకాంక్షలు తెలియజేయండి.
తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు రూపం తెలంగాణ ఆడబిడ్డల పూల సంబరం.మన బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఎంగిలి పూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.
తెలంగాణ సంస్కృతికి ప్రతీక, మన బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడ బిడ్డలందరికి
ఎంగిలి పూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, జీవన విధానాన్ని ప్రతిబింబించేలా ఆడపడుచులందరూ కలిసి ఘనంగా జరుపుకునేదే బతుకమ్మ పండుగ. ప్రజలందరికీ ఎంగిలి పూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు...
తంగేడు పూవుల్లు తంబాలమంతా... తీరొక్క రంగుల్లో తీరిచ్చినా పువ్వు తీరొక్క రంగుల్లో తీరిచ్చినా పువ్వు బంగారు చీరలు బాజారులన్నీ బతుకమ్మ పండుగ నా తెలంగాణ నా తెలంగాణ బంతి పువ్వుల తోట నా తెలంగాణ నా తెలంగాణ….
పువ్వులను పూజించే గొప్ప పండగ బతుకమ్మ. మన పండగ, మన సంస్కృతి, మన సాంప్రదాయాన్నీ వెలుగెత్తే.. ఆడపడుచుల ఔన్నత్యాన్ని చాటి చెప్పే.. ప్రకృతి దేవత మన బతుకమ్మ. ప్రజలందరికీ ఎంగిలి పూల బతుకమ్మ పండగ శుభాకాంక్షలు.
తంగేడు పూల తుళ్లింతలు.. గునుగు పూల గుబాలింపులు.. తెలంగాణ సంస్కృతికి సంప్రదాయాలకు నిలువెత్తు రూపం. బతుకమ్మ ఆడబిడ్డలందరికి ఎంగిలి పూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు