హిందువులు లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. ఇల్లు శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి వస్తుందని మన పెద్దలు చెబుతుంటారు. స్త్రీలను లక్ష్మీదేవితో పోలుస్తారు. మిగతా రోజుల్లో కంటే శుక్రవారం పూట ఇంటిని మరింత పరిశుభ్రంగా ఉంచుతారు. ఆ రోజు స్త్రీలు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి లక్ష్మీదేవిలా ముస్తాబై.. వాకిట్లో కల్లాపు చల్లి ముగ్గు పెట్టి లక్ష్మీదేవిని పూజిస్తారు. అలా చేయడం అంటే లక్ష్మీదేవికి ఇష్టం అని చెబుతారు. ప్రతి ఒక్కరి జీవితంలో తమ జీవితం మలుపు తిరుగుతుందని సంకేతాలు ముందుగానే తెలుస్తాయని అంటారు. అలాగే డబ్బు వచ్చే ముందు కూడా కొన్ని సంకేతాలు తెలుస్తాయని అంటూ ఉంటారు.
కోకిల కూత : కోకిల కూత వినడానికి చాలా బాగుంటుంది. కోకిల చేసే శబ్దం ధనానికి సూచికగా చెబుతుంటారు. కోకిల కూసే దిశ ఆధారంగా కూడా శుభం , అశుభంలను గుర్తిస్తారు. ఉదయం పూట ఆగ్నేయ దిశ నుంచి కోకిల కూత వినిపిస్తే నష్టం జరుగుతుందని నమ్ముతారు. అదే సాయంత్రం పూట వినిపిస్తే శుభం జరుగుతుందని అంటారు. మధ్యాహ్నం పూట కోకిల కూత వినిపించిన శుభం జరుగుతుందని నమ్ముతారు. ఏదైనా పనిమీద వెళ్లినప్పుడు కోకిల కూసిన శబ్దం వినబడితే లాభాలు వస్తాయని, మామిడి చెట్టు మీద కూర్చుని కోకిల కూస్తుంటే లక్ష్మీదేవి వస్తుందని నమ్మకం.
చీమలు తిరిగితే : ఇంట్లో చీమలు ఉంటే చీమల మందు వేసి మరీ చంపేస్తాం. ఇంట్లో నల్ల చీమలు తిరుగుతుంటే మంచిదని శాస్త్రం చెబుతుంది. నోటితో బియ్యం ధాన్యాలు మోస్తున్న నల్ల చీమలు తిరిగితే మంచిదని అంటారు. అక్షింతలు అనేవి శుభ్రం కలగజేసేవి. కాబట్టి లక్ష్మీదేవికి చాలా ఇష్టమట. అక్షింతలు బియ్యంతోనే చేసేవి కాబట్టి సంపదతో ముడి పెడతారు. ఇక ఇంట్లో ఎర్ర చీమలు పెరిగితే మాత్రం అప్పు పెరుగుతుందని నమ్ముతారు.
Vastu Rules For TV: వాస్తు ప్రకారం ఇంట్లో టీవీ ఏ దిక్కులో ఉండాలో తెలుసా ...
బల్లి పడితే : బల్లి పడితే చిరాకు పడతాం. అశుభంగా భావిస్తారు. అయితే అదే బల్లి కొన్ని చోట్ల పడితే శుభాలు జరుగుతాయని నమ్ముతారు. శాస్త్రం ప్రకారం.. కుడి చేతి పై పడి వెంట వెంటనే పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తే.. త్వరలోనే మీరు కుంభస్థలాన్ని కొట్టబోతున్నారని అర్థం. బల్లి సంపదకు చిహ్నంగా భావిస్తారు.
రెండు తలల పాము కనిపిస్తే : పాము అంటేనే అసహ్యం వేస్తుంది. ఇంట్లో పాము కనిపిస్తే ఎక్కడ కాటేస్తుందో అని చంపేందుకు ప్రయత్నిస్తారు. కానీ పాములు శుభ సూచికమని కొంతమంది నమ్మకం. ఇంట్లో ఎప్పుడైనా రెండు తలల పాము కనబడితే మంచిది. చూసిన వారి ఇంటికి వెళ్లడం వల్ల కూడా శుభం కలుగుతుందని నమ్ముతారు. పాము కనిపిస్తే చంపకుండా బయటికి వెళ్లేందుకు మార్గం చూపించాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి తలుపు తడుతుందని విశ్వసిస్తారు.