హిందూ మతంలో, ప్రతి నెల శుక్ల పక్షం, కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి నాడు విష్ణువును పూజిస్తారనేది అందరికీ తెలిసిన విషయమే. మాఘ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి రోజున భీష్మ ఏకాదశి జరుపుకుంటారు. ఈ సంవత్సరం, జయ ఏకాదశి ఫిబ్రవరి 8న జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలో జయ ఏకాదశి జరుపుకుంటే, దక్షిణ భారతీయులు దీనిని భీష్మ ఏకాదశి అని పిలుస్తారు. ఉత్తరాయణ శుభ కాలంలో భీష్ముడు మరణించారు. భీష్ముడు తన మరణానికి ముందు ధర్మరాజుకు విష్ణు సహస్ర నామాలను బోధించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ పవిత్రమైన రోజును భీష్మ ఏకాదశి అంటారు. భీష్మ ఏకాదశి రోజున భీష్మునికి తర్పణం అర్పించి విష్ణువును పూజించిన వారికి కష్టాలు తొలగిపోతాయని నమ్మకం. భీష్మ ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రోజున ఉపవాసం ఉండటం వల్ల పాపాలకు ప్రాయశ్చిత్తం అవుతుందని మరియు జీవితంలో విజయం లభిస్తుందని నమ్ముతారు. ఈ రోజున భక్తులు ఉదయం స్నానం చేసి, ఉపవాస దీక్షను ఆచరిస్తారు. కొందరు పూర్తిగా ఉపవాసం ఉంటే, మరికొందరు ఫలాహారం తీసుకుంటారు. అలాగే ఈ రోజున విష్ణుసహస్రనామాన్ని పారాయణం చేయడం ఎంతో ఫలప్రదంగా ఉంటుంది. అన్నదానం, దానం చేయడం భీష్మ ఏకాదశి నాడు చాలా పుణ్యకరమని విశ్వసిస్తారు. భక్తులు విష్ణు, శ్రీరామ, వేంకటేశ్వర స్వామి ఆలయాలను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు 2025

భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు 2025

భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు 2025

భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు 2025

భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు 2025