సనాతన ధర్మంలోని పురాణఇతిహాసాల ప్రకారం ఇంద్రుడు చేసిన పొరపాటు వల్ల స్వర్గలోకం విడిచి లక్ష్మీదేవి వెళ్లిపోయింది. ఆ సమయంలో రాక్షసులు స్వర్గంపై దాడి చేసి లక్ష్మీదేవిని స్వాధీనం చేసుకున్నారు. అప్పుడు విష్ణుమూర్తి సముద్రాన్ని మథనం చేయమని దేవతలకు సలహా ఇచ్చాడు. దేవతలు రాక్షసుల సహాయంతో సముద్రాన్ని మథనం చేశారు. సముద్ర మథనం నుండి 14 రత్నాలు లభించాయి. వీటిలో హాలాహల విషం, అప్సర రంభ, ఐరావతం, కామధేను ఆవు కూడా ఉన్నాయి. దీనితో పాటు, సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి కూడా జన్మించింది. అదే సమయంలో, ఆయుర్వేద పితామహుడు ధన్వంతరి కూడా కలశంతో ప్రత్యక్షమయ్యాడు. పంచాంగ గణనల ప్రకారం, ధన్వంతరి భగవానుడు ఆశ్వీయుజ మాసంలోని బహుళ పక్షం త్రయోదశి తిథి నాడు ప్రత్యక్షమయ్యాడు. దీని కోసం, ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని కృష్ణ పక్ష త్రయోదశి తిథి నాడు ధంతేరస్ జరుపుకుంటారు. ఈ శుభ సందర్భంలో, ధన్వంతరి, లక్ష్మీ దేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. ధంతేరస్ పర్వదినం సందర్భంగా మీ బంధు మిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయాలంటే ఇక్కడ ఉన్న ఫోటో గ్రీటింగ్స్ ఉపయోగించుకోండి.
ధనత్రయోదశి శుభాకాంక్షలు
మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ ధన త్రయోదశి శుభాకాంక్షలు..
ధన త్రయోదశి సందర్భంగా మీ అందరికీ ప్రయోజనాలు కలగాని కోరుకుంటూ..ప్రత్యేక శుభాకాంక్షలు
ఐశ్వర్యాధిదేవత అయిన శ్రీ మహాలక్ష్మీ దేవి అందరికీ కుటుంబాలలో సంతోషాలు, జీవితంలో సౌఖ్యాలు ఇళ్ళలో ధనరాశులు వర్షించాలని మనసారా ప్రార్థిస్తున్నాను..అందరికీ ధంతేరస్ శుభాకాంక్షలు..
మీకు మీ కుటుంబ సభ్యులకు ధన త్రయోదశి శుభాకాంక్షలు నిండు నూరేళ్ళు సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, పిల్లాపాపలతో, సిరిసంపదలతో, ఉన్నత విద్య, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఉన్నత పదవులు పొందుతూ ఉండాలని శ్రీ ధనలక్ష్మి మాతను ప్రార్థిస్తున్నాను
క్షీరసాగర మథనంలో శ్రీ మహాలక్ష్మీదేవి, కల్పవృక్షం, కామదేనువు,శ్రీ ధన్వంతరి ఉద్బవించిన రోజైన ధనత్రయోదశి ప్రజలందరికీ అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కల్గించాలని కోరుకుంటూ ధన త్రయోదశి శుభాకాంక్షలు..