Representative image

జ్యోతిష్య శాస్త్రంలో అనేక అద్భుతాలకు అవకాశం ఉంది ముఖ్యంగా కొన్ని రాశులకు గ్రహాల మార్పులు అనుకూలిస్తాయి. అటువంటి గ్రహాల మార్పుల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం. తద్వారా ఆయా రాశుల వారికి జీవితంలో అనేక లాభాలు నష్టాలు సైతం కలిగే అవకాశం ఉంది తాజాగా ఏప్రిల్ 25 నుంచి అంటే వైశాఖ పంచమి నుంచి ఐదు రాశుల వారికి శుభ ఘడియలు ప్రారంభం కానున్నాయి. మేషరాశిలోని 5 గ్రహాల ప్రత్యేక యోగం ఏర్పడనుంది. అవి సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం, త్రిపుష్కర యోగం, రవియోగం, ఆయుష్మాన్ యోగం, సౌభాగ్య యోగం వంటి అద్భుతమైన యోగాలు ఏర్పడతాయి. 3 రాశుల వ్యక్తులు ఈ శుభ యోగాల నుండి చాలా ప్రయోజనం పొందుతారు. వారి ఆదాయం ఆకస్మికంగా పెరుగుతుంది మరియు ఉద్యోగంలో ప్రమోషన్ పొందవచ్చు. ఈ అదృష్ట సంకేతాలు ఏమిటో చూద్దాం.

మేష రాశి: ఈ రాశి వారికి ఏప్రిల్ 25 నుంచి అద్భుత యోగం ప్రారంభం కామందు ముఖ్యంగా వ్యాపారం చేసే వారికి ఏప్రిల్ 25 నుంచి చాలా కలిసి రానుంది లక్ష్మీదేవి కటాక్షంతో కొత్త ఆర్డర్లు పొందడం లేదా కొత్త వ్యాపార అవకాశాలు లభించడం కనుగొనవచ్చు అలాగే లాటరీ టికెట్లు కొనే వారికి అదృష్టం కలిసి వచ్చి లాటరీ తగిలే అవకాశం కూడా ఉంది.  అయితే రేపటి నుంచి 15 రోజులపాటు దూర ప్రయాణాలకు కారు లేదా బైకు వంటివి వాడకపోవడం మంచిది.  అర్జెంటుగా వెళ్లాల్సివస్తే బస్సు లేదా రైలులో వేయడం మంచిది.

కన్యా రాశి: ఏప్రిల్ 25 నుంచి ఈ రాశి వారికి అద్భుతంగా ఉండనుంది ముఖ్యంగా పాత అప్పులు వసూళ్లు అయ్యే అవకాశం ఉంది.  దీంతోపాటు గతంలో మీరు నష్టపోయిన వ్యాపారంలో లాభాలు కూడా పొందే అవకాశం ఉంది.  మీరు వదిలేసుకున్న ఇక జీవితంలో లాభం రాదనుకున్న స్థిరాస్తులు రియల్ ఎస్టేట్ ప్లాట్లు మంచి విలువను పొందే అవకాశం ఉంది.  ఇక విదేశీ వీసా కోసం ఎదురుచూస్తున్న వారికి రాబోయే 15 రోజులు అదృష్టాన్ని తెస్తోంది.  ఉద్యోగులకు ప్రమోషన్లు తగ్గే అవకాశం ఉంది వేతనం కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. 

మీన రాశి:  ఈ రాశుల వారికి అదృష్టం ప్రారంభం కానుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారికి ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే రాజకీయాల్లో ఉన్న వారికి కూడా బాగా రాణించే అవకాశం.  ఉంది రాబోయే వారంలో మీరు ఓ శుభవార్త వినబోతున్నారు.  పెళ్లి కాని వారికి మంచి సంబంధం సెట్ అయ్యే అవకాశం ఉంది.  అలాగే  వ్యాపార రంగంలో అనుకోని లాభాలు వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నారు.