
ఒక వ్యక్తి ఏ రాశిలో జన్మించాడో, ఆ గ్రహాలు అతడిపై ప్రభావం చూపుతాయి. పుట్టిన ప్రతీ ఒక్కరిలో ఒక్కో ప్రత్యేకమైన లక్షణాలుంటాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, రాశి చక్ర గుర్తులు ఒకే విధమైన లక్షణాలను కలిగి ఉంటాయి. ఒక్కో రాశికి ఒక్కో ప్రత్యేక లక్షణాలుంటాయి. సూర్యుడిని గ్రహాల రాజుగా పరిగణిస్తుంటారు. మీ జాతక చక్రంలో సూర్యుడు ఎంత బలంగా ఉంటే మీరు మీ కెరీర్ లోనూ, వ్యాపారంలోనూ అన్ని విజయాలను చూస్తారు. సూర్యుడు ఏడాది పొడవునా మొత్తం 12 రాశుల్లో సంచరిస్తాడు. సూర్యుడు ఏ రాశిలోకి ప్రవేశిస్తే ఆ రాశి వారికి అదృష్టం తలుపుతడుతుంది. సెప్టెంబర్ 15 నుంచి నెలాఖరు వరకూ వచ్చే రెండు వారాల్లో ఏయే రాశి వారికి శుభం కలుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మిథున రాశి :
సూర్యుని రాశిలో మార్పు మిథున రాశి వారికి ధన లాభం చేకూర్చుతుంది. ఉద్యోగస్తుల జీతాలు పెరగవచ్చు. సాఫ్ట్ వేర్ ఉద్యోగాల్లో ఉన్న వారు ప్రమోషనం పొందుతారు. ఇతర ప్రైవేటు రంగానికి సంబంధించిన ఉద్యోగులు పెద్ద లాభాలను పొందవచ్చు.
సింహరాశి :
సింహరాశి వారికి కర్కాటక రాశిలో సూర్యుని ప్రవేశం కూడా శుభప్రదం. వ్యాపారంలో భారీ లాభాలు పొందవచ్చు. ప్రయాణాలు సఫలం అవుతాయి. పెద్ద ప్రయోజనాలను అందిస్తాయి. మీ పనికి తగిన ప్రశంస లభిస్తుంది. ఆదాయం పెరిగే కొద్దీ బలమైన అవకాశాలు ఉంటాయి.
Neelam Gemstone Benefit: నీలమణిని ఏ రాశి వారు ధరించాలి, నీల మణి రత్నం ఉంగరంలో ధరించిన తర్వాత చేయాల్సిన పని ఇదే..
తులరాశి :
ఈ రాశి వారికి కూడా సూర్య సంచారం శుభప్రదం. వారు తమ కెరీర్‌లో గొప్ప విజయాన్ని అందుకోవచ్చు. ఉద్యోగం మారాలనుకునే వారికి కొత్త ఉద్యోగాలు లభిస్తాయి. మీరు ప్రశంసలు పొందుతారు. డబ్బు కూడా పెరుగుతుంది. కుటుంబం మద్దతు లభిస్తుంది. ఆస్తి కొనుగోలుకు ఇది మంచి సమయం.
వృశ్చిక రాశి :
వృశ్చికరాశిలో సూర్యుడు సంచరించిన తరువాత మీకు నెల రోజుల పాటు చాలా లాభాలు కలుగుతాయి. ఉద్యోగాలు మార్చుకోవచ్చు. మంచి ఉద్యోగ ఆఫర్లు లభిస్తాయి. ఇక ఈ సమయం చాలా విషయాల్లో శుభప్రదంగా ఉంటుంది. పనిలో విజయం ఉంటుంది. వ్యాపారస్తులు లాభపడతారు. గౌరవం పెరుగుతుంది.