Dhanvantari Mantram : ధన్వంతరి క్షిర సాగర మధన సమయంలో అమృత కలశాన్ని చేబట్టుకొని ఉద్భవించిన శ్రీ మహా విష్ణువు అవతారంగా భాగవతంలో చెప్పబడింది. ఈ స్తోత్రము ప్రతి రోజు పారాయణ చేయడం వలన సర్వ రోగములు తగ్గి ఆయురారోగ్యములు పొందుతారు. ఎవరైనా అనారోగ్యము తో ఉన్న లేక దీర్ఘకాలిక రోగముల తో ఉన్నప్పుడు వారు తీసుకునే మందులతో పాటు ఈ మంత్రాన్ని రోగ గ్రస్తులు కానీ లేక వారికి సంబందించిన వారు కానీ పఠించిన ఎడల వచ్చిన రోగము చాలా త్వరగా తగ్గిపోతుంది. మందులు వాడితే ఇక ఈ మంత్రం ఎందుకు అని అనుమానం రావచ్చు. మందులు మీ శరీరానికి ఉన్న రోగాన్ని తగ్గిస్తే ఈ మంత్రం మీ మనో ధైర్యం పెంచి అతి త్వరగా మిమ్మల్ని ఆ వ్యాధి నుండి బయట పడేస్తుంది అనడం లో సందేహమే లేదు.
Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం గ్యాస్ స్టవ్ ఏ దిక్కున ఉంటే మంచిది ...
నమామి ధన్వంతరి మాదిదేవం
సురాసురైర్వందిత పాదపద్మం
లోకేజరారుగ్భయ మృత్యునాశం
ధాతారమీశం వివిధౌషధీనాం..