
చెడుపై మంచి సాధించిన విజయం, అసుర శక్తులపై దైవత్వం సాధించిన విజయమే ఈ విజయదశమి. మహిషాసురునిలోని కామ, క్రోధ, లోభ, మోహాలు మనిషిలో ఉంటే మనిషి పతనం వైపు పయనిస్తాడని, అందుకే మనలోని కామ, క్రోధ, లోభ, మోహలను జయించడమే నిజమైన విజయదశమి పండుగ. ఈ పండుగ రోజు ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తారు..అలాగే ఐశ్వర్యం, ధీరత్వం, కీర్తి, తేజస్సు, ఆరోగ్యం, ఆకర్షణ, ఆనందం, సౌజన్యం అనే అష్టమహా ఫలితాల్ని శరన్నవరాత్రుల్లో భక్తులు దేవీ కరుణతో సాధిస్తారని దేవీ భాగవతం వివరించింది .అందుకోసం విజయద అయిన అపరాజిత అనుగ్రహాన్ని సర్వదా ఆకాంక్షించాలి.. విజయదశమిని ‘దసరా’ అనీ పిలుస్తారు .. దశవిధాలైన పాపాలను హరించేది కనుక ‘దశహరా’ నే ‘దసరా’ అయ్యింది .. ఈ సందర్భంగా మీ బంధు మిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయాలి అనుకున్నట్లయితే, ఈ ఫోటో గ్రీటింగ్స్ మీ కోసం..

లోకకల్యాణార్థం జగన్మాత తొమ్మిది రోజులు ఒక్కో రూపం ధరించి తొమ్మిది మంది రాక్షసులను సంహరించింది. అమ్మవారు సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమిని పర్వదినంగా జరుపుకుంటాము. మీరు చేపట్టిన ప్రతి పని విజయవంతం కావాలని ప్రాధ్రిస్తూ, అందరికీ విజయదశమి శుభాకాంక్షలు.

సంకల్పబలంతో అనుకున్నది సాధించగలం అనేందుకు ప్రతీక విజయదశమి పండుగ. ఆ పరాశక్తి కృపతో అందరికీ సకలశుభాలు కలగాలని, సిరిసంపదలు వృద్ధి చెందాలని కోరుకుంటూ, ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు.

సత్యవాక్ పరిపాలకుడైన శ్రీ రామచంద్రుని ఆదర్శవంతమైన, స్ఫూర్తివంతమైన జీవితాన్ని, ఆ పురుషోత్తముని జీవితం నుంచి మనకు లభించే మార్గదర్శనాన్ని దసరా పండుగ మనకు తెలియజేస్తుంది.


అందరికీ విజయదశమి శుభాకాంక్షలు.