Horoscope Today 11 June 2022, Astrology: శనివారం రాశి ఫలితాలు ఇవే, ఈ రోజు ఈ రాశివారు స్నేహితుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఈ రాశి వారు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మీ రాశి ఫలితం వెంటనే చెక్ చేసుకోండి..
(Photo Credits: Flickr)

Horoscope Today 11 June 2022, Astrology : జ్యోతిషశాస్త్ర లెక్కల ప్రకారం, ఈరోజు కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేష, మిథున, తుల, మకర రాశుల వారు ఈరోజు డబ్బు, వృత్తి విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. గ్రహాల కదలిక మొత్తం 12 రాశులను ప్రభావితం చేస్తుంది. ఈ రోజు మీకు ఎలా ఉంటుంది, అన్ని రాశుల వారి జాతకం తెలుసుకుందాం-

మేషం :

మంచి ఫలితాలు సాధిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధు, మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. అభివృద్ధి కోసం మీరు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. శివారాధన శుభప్రదం.

వృషభం :

ఈ రోజు మీ మీ రంగాల్లో మేలైన ఫలితాలు ఉన్నాయి. మీరు చేసే పని పెద్దలను మెప్పిస్తుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. తోటివారితో కలిసి ఆనందంగా గడుపుతారు. ఇష్టదేవతారాధన శుభకరం.

మిధునం :

ఈ రోజు ప్రశాంత చిత్తంతో పనులను చేయండి. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందిపడతారు. శ్రీ వేంకటేశ్వరుడిని ఆరాధించడం మంచిది.

Telangana Govt Jobs 2022: నిరుద్యోగులకు మరో శుభవార్త, 1,433 పోస్టులకు తెలంగాణ ఆర్థిక శాఖ గ్రీన్‌ సిగ్నల్‌, త్వరలో ఈ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల  

కర్కాటకం :

ఈ రోజు శ్రమకు తగ్గ ప్రతిఫలం అందుతుంది. చేపట్టిన పనులను పూర్తిచేయడంలో కాస్త ఇబ్బందులు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అనవసర వ్యవహారాల్లో తలదూర్చకుండా ఉండటం మేలు. శివపంచాక్షరి జపించాలి

సింహం :

ఈ రోజు ప్రారంభించిన పనులను ప్రణాళికతో పూర్తిచేయగలుగుతారు. అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగి మంచి ఫలితాలను అందుకుంటారు. విందు, వినోదాలతో కాలం గడుస్తుంది. కొన్ని

సంఘటనలు మీలో ఉత్సాహాన్ని పెంచుతాయి. నవగ్రహ ఆలయ సందర్శనం మరింత శుభాన్ని చేకూరుస్తుంది.

కన్య :

ఈ రోజు ఒక ముఖ్యమైన వ్యవహారంలో కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల తరవాత ఇబ్బంది పడతారు. కొన్ని పరిస్థితులు మానసిక అసంతృప్తిని కలిగిస్తాయి.

సూర్యగ్రహ ధ్యానం మంచిది.

తుల:

ఈ రోజు మీ మీ రంగంలో శ్రమ పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. మీ బంధువుల ప్రవర్తన మీకు కాస్త మనస్తాపాన్ని కలిగిస్తుంది. శారీరక శ్రమ పెరుగుతుంది. కొందరు అధికారులు లేదా పెద్దలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. ధన వ్యయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. శ్రీహరిని ఆరాధిస్తే మంచిది.

వృశ్చికం :

ఈ రోజు ప్రారంభించబోయే పనుల్లో ఎదురయ్యే ఆటంకాలను తెలివిగా అధిగమిస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. తోటివారితో అభిప్రాయ బేధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. సూర్య ఆరాధన శుభప్రదం.

ధనుస్సు :

ఈ రోజు ప్రయత్న కార్యానుకూలత ఉంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఒక వార్త మీ ఇంట సంతోషాన్ని నింపుతుంది. ఈశ్వరారాధన సత్ఫలితాలను ఇస్తుంది.

మకరం :

ఈ రోజు శుభఫలితాలు పొందుతారు. ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉన్నాయి. స్వస్థాన ప్రాప్తి ఉంది. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. పెద్దల ఆశీర్వచనాలు మేలు చేస్తాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. దుర్గాస్తుతి చదవాలి.

కుంభం :

ఈ రోజు ప్రారంభించబోయే పనులలో బంధు,మిత్రుల సహకారం లభిస్తుంది. మీ పేరుప్రతిష్టలు పెరుగుతాయి. బుద్ధిబలం బాగుంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. *దుర్గాస్తుతి చేయడం వలన మంచి ఫలితాలను పొందగలుగుతారు.

మీనం :

ఈ రోజు చేపట్టే పనులలో కొన్ని ఇబ్బందులు తప్పవు. అధికారులు మీ తీరుతో సంతృప్తి చెందకపోవచ్చు. బంధు, మిత్రులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఒక సంఘటన మనస్తాపాన్ని కలిగిస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు.